బాలయ్య బాబు తన కెరీర్ లో 100కు పైగా సినిమాలు చేశారు.

బాలయ్య బాబు తన కెరీర్ లో 100కు పైగా సినిమాలు చేశారు. అయితే అందులో కొన్ని హిట్ అయ్యాయి.. కొన్ని ప్లాప్ అయ్యాయి. ఏ సినిమా హిట్ అవుతుంది అనేది ఎవరూ ఊహించలేరు కదా..? అలానే అనుకోకుండా బాలకృష్ణ మిస్ అయిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఏంటో తెలుసా..?

నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఆయన తాజాగా నటించిన డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా ఈమూవీ జనవరి 12కి పెద్ద ఎత్తున రిలీజ్ కాబోతోంది. మెగా డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈసినిమా బాలయ్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా నిలవబోతోంది. ఈసినిమాకు దాదాపు 100 కోట్ల బడ్జెట్ పెట్టినట్టు సమాచారం.

ఇక వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతున్న బాలయ్య గతంలో వరుస ఫెయిల్యూర్స్ తో చాలా ఇబ్బంది పడ్డాడు. అయితే బాలకృష్ణ తనకెరర్ లో ఒకన్ని సినిమాలు రిజెక్ట్ చేశారట. అవి చేసి ఉంటే ఆయన కెరీర్ ఇంకా స్పీడ్ గా ముందుకు వెళ్ళేదట. ఇంతకీ ఆసినిమాలు ఏంటి.. ఆ బ్లాక్ బస్టర్ సినిమాలు బాలకృష్ణ చేయకపోవడానికి కారణం ఏంటి..? మరి ఆ సినిమాలు ఎవరు చేశారు.. చూద్దాం.

బాలకృష్ణ రిజెక్ట్ చేసిన సినిమాలతో సింహాద్రి ఒకటి. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ సినిమా నిలిచిన ఈమూవీని టాలీవుడ్ జక్కన్న రాజమౌళి డైరెక్ట్ చేశాడు. అయితే మొదటిగా రాజమౌళి సినిమాను బాలయ్యతో తెరకెక్కించాలి అని అనుకున్నాడట బాలకృష్ణ కాల్ షీట్స్ ఖాళీ లేకపోవడంతో.. ఈ సూపర్ హిట్ సినిమా ఎన్టీఆర్ ఖాతాలోకి పడిపోయింది . అయితే బాలయ్య ఈ సినిమాకంటే ముందు కాల్షిట్స్ ఇచ్చిన పలనాటి బ్రహ్మనాయుడు మాత్రం డిజాస్టర్ అయ్యింది.

వెంకటేష్ నటించిన చంటీ సినిమా గుర్తుందా..? ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఈసినిమాకు బ్రహ్మరధం పట్టారు. తమిళ స్టార్ డైరెక్టర్ చంద్రముఖి ఫేమ్ వాసు ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈసినిమాను ముందుగా తెలుగులో బాలయ్యతో చేయాలి అని అనుకున్నారట. కాని బాలకృష్ణ మాత్రం కథ బాగుంది.. కాని ఈ పాత్రలో నా ఫ్యాన్స్ నన్ను యాక్సప్ట్ చేయరేమో అని డౌట్ తో రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత ఈ సినిమా వెంకటేష్ చేసి ఎంత పెద్ద హిట్ అందుకున్నాడో అందరికీ తెలిసిందే .

బాలయ్య వదలుకున్న మరో సినిమా జానకి రాముడు: నాగార్జున , విజయశాంతి కాంబినేషన్లో తెరకెక్కిన ఈసినిమా ఎమోషనల్ డ్రామాగా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిచింది. ఈ సినిమా కథ కూడా ముందు బాలయ్య దగ్గరకే వచ్చిందట. అయితే బాలకృష్ణ కూడా ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు కూడా. కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా చేయాలని అనుకున్నాడట. కాని అనుకోకుండా ఈసినిమా రాఘవేంద్రరావు గారి చేతికి వెళ్లింది. దాంతో పరిణామాలుమారిపోయి.. బాలయ్య ఈసినిమాపై ఇంట్రెస్ట్ పెట్టలేదని సమాచారం.

బాలయ్య మిస్ అయిన మరో సూపర్ డూపర్ హిట్ సినిమా సింహరాశి. యాంగ్రీయంగ్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న రాజశేఖర్ కెరియర్ ని మలుపు తిప్పిన సినిమా ఇది. అయితే ఈసినిమాను ముందుగా బాలయ్యను చేయమని అడిగారట. కాని ఈసినిమా రీమేక్ అవ్వడంతో పాటు.. నందమూరి ఫ్యాన్స్ కు ఇష్టమైన యాక్షన్, ఫైట్స్ ఇందులో పెద్దగా కనిపించవు. దాంతో ఈసినిమా చేయడానికి బాలకృష్ణ ఇంట్రెస్ట్ పెట్టలేదట. దాంతో ఈసినిమా రాజశేఖర్ చేసి సూపర్ హిట్ కొట్టాడు.

ఇక ఈమధ్యే వచ్చిన రవితేజ క్రాక్ మూవీ కూడా బాలకృష్ణ దగ్గరకే ముందుగా వెళ్ళిందట. రవితేజ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన క్రాక్ సినిమాను గోపీచంద్ మలినేని బాలయ్య కోసమే రాశాడట. ఎందుకో ఏమో కాని.. చేయాలని కూడా ఈసినిమా విషయంలో డ్రాప్ అయ్యాడట బాలకృష్ణ. దాంతో అంతకు ముందు వరకూ వరుసగా ఫెయిల్యూర్స్ చూస్తూ వచ్చిన రవితేజకు ఈమూవీ సాలిడ్ కమ్ బ్యాక్ అయ్యింది. ఇక ఇలా ఈ 5 సినిమాలు బాలకృష్ణ రిజెక్ట్ చేశాడు అన్నది టాక్. మరి ఇందులో నిజం ఎంత ఉందో తలియాల్సి ఉంది.

ehatv

ehatv

Next Story