2018 ఆగస్టు కేరళలలో వచ్చిన వరదలు(Floods) అందరికీ గుర్తుండే ఉంటుంది. కేరళలలో 100 ఏళ్లలో ఎన్నడూ రాని విధ్వంసాన్ని సృష్టించిన వరదలు అవి. ఆ వరదల్లో 483 మంది ప్రాణాలు కోల్పోగా, 10 వేల మందిని కొన్ని రోజులపాటు రిలీఫ్ క్యాంప్‌లకు తరలించారు. ఈ ఇన్సిడెంట్ ఆధారంగా వచ్చిన సినిమాయే 2018. అవార్డు విన్నర్ డైరెక్టర్ జుడ్ ఆంథోనీ జోసెఫ్(Judd Anthony Joseph) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
2018 ఆగస్టు కేరళలలో వచ్చిన వరదలు(Floods) అందరికీ గుర్తుండే ఉంటుంది. కేరళలలో 100 ఏళ్లలో ఎన్నడూ రాని విధ్వంసాన్ని సృష్టించిన వరదలు అవి. ఆ వరదల్లో 483 మంది ప్రాణాలు కోల్పోగా, 10 వేల మందిని కొన్ని రోజులపాటు రిలీఫ్ క్యాంప్‌లకు తరలించారు. ఈ ఇన్సిడెంట్ ఆధారంగా వచ్చిన సినిమాయే 2018. అవార్డు విన్నర్ డైరెక్టర్ జుడ్ ఆంథోనీ జోసెఫ్(Judd Anthony Joseph) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో టొవినో థామస్(Tovino Thomas), అపర్ణ బాలమురళి(Aparna Balamurali), వినీత్ శ్రీనివాసన్(Vinith srinivas), అసిఫ్ అలీ(Asif Ali), కుంచకో బోబన్, లాల్ తన్వి రామ్ కీలక పాత్రల్లో నటించారు. అయితే మే 5న ఆ రాష్ట్రంలో పెద్దగా ప్రమోషన్స్ ఏమీ లేకుండా థియేటర్స్‌లో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా దేశంలోనే కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్లలో కూడా బిగ్గెస్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో మరో రికార్డును సొంతం చేసుకుంది. మాలీవుడ్‌లో ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో ఇప్పుడు సినిమాపై టాలీవుడ్ నిర్మాతల కన్ను పడింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు విడుదల చేయనున్నారు. నైజా ఏరియా డిస్ట్రిబ్యూషన్స్ను గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. బన్నీ వాస్ ఎప్పుడు కంటెంట్ ఓరియంటెండ్ సినిమాలను ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు 2018 అనే మలయాళ చిత్రం ఆ కోవకు చెందినది కావడంతో తెలుగులోనూ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం, డ్యామ్‌ల ఓపెనింగ్స్, వరదల్లో మునిగిపోయిన ఇళ్లు, జనాలు భయభ్రాంతులకు గురైన సీన్స్‌ను ట్రైలర్లో చూపించారు. కావ్య ఫిలిం కంపెనీ, పీ.కె ప్రైమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై వేణు కున్నప్పిలి, సికె పద్మకుమార్, ఆంటోనీ జోసెఫ్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో మే 26న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ డిజాస్టర్డ్ డ్రామాను వెండి తెరపై చూసేందుకు తెలుగు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.