ప్రశాంత్ వర్మ(Prashnath Varma), తేజ(Teja) కాంబినేషన్లో నిర్మించిన హనుమాన్ సినిమా మరో రికార్డును సొంతం చేసుకుంది. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ఫ్లాట్‌ఫాం బుక్ మై షోలో(Book My Show) 20 లక్షల టికెట్లు అమ్ముడైన చిత్రంగా నిలిచింది.

Hanuman Movie
ప్రశాంత్ వర్మ(Prashnath Varma), తేజ(Teja) కాంబినేషన్లో నిర్మించిన హనుమాన్ సినిమా మరో రికార్డును సొంతం చేసుకుంది. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ఫ్లాట్‌ఫాం బుక్ మై షోలో(Book My Show) 20 లక్షల టికెట్లు అమ్ముడైన చిత్రంగా నిలిచింది. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో ఇదే రికార్డు అని బుక్ మై షో ప్రకటించింది. కాగా హనుమాన్ ప్రభంజనం ఇప్పట్లో ఆగేలా లేదు. ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
తక్కువ థియేటర్లలో విడుదలైనప్పటికీ కేవలం నాలుగు రోజుల్లోనే 100 కోట్ల వసూళ్లు సాధించడం హనుమాన్ సినిమాకు వస్తున్న ఆదరణకు నిదర్శనం. ప్రముఖులు, సెలెబ్రిటీలతో పాటు ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తున్నారు. చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ(Nandhamuri Balakrishna) హనుమాన్(Hanuman) సినిమాను వీక్షించారు. హైదరాబాద్ సిటీలోని ప్రసాద్ ల్యాబ్స్‌లో బాలయ్య కోసం ‘హనుమాన్’ స్పెషల్ షో ప్రదర్శించారు. హీరో తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా హాజరయ్యారు. సినిమాను చూసిన బాలయ్య.. తేజ సజ్జా, ప్రశాంత్ వర్మలతో చిత్ర బృందానికి అభినందించారని సమాచారం.
