పై ఫోటోలో ఉన్న మహిళ ఎవరో గుర్తుపట్టారా? ఈమె ఒకప్పుడు తెలుగు, తమిళ సినిమాల్లో కథానాయికగా నటించింది. తదనంతర కాలంలో సహాయ నటి పాత్రలు కూడా పోషించింది.
పై ఫోటోలో ఉన్న మహిళ ఎవరో గుర్తుపట్టారా? ఈమె ఒకప్పుడు తెలుగు, తమిళ సినిమాల్లో కథానాయికగా నటించింది. తదనంతర కాలంలో సహాయ నటి పాత్రలు కూడా పోషించింది. కాదల్ కవితై(Kadal kavithai) సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈమె అందులో బాలనటిగా నటించింది. తర్వాత నీ మనసు నాకు తెలుసు(Naku thelusu) అనే తెలుగు సినిమాలో కాలేజీ స్టూడెంట్‌గా కనిపించింది. కాదల్ సినిమాలో ముఖ్య భూమికను పోషించింది. ఇది తెలుగులో ప్రేమిస్తేగా డబ్ అయ్యింది. ఇన్నేసి హింట్స్ ఇచ్చినా ఇంకా గుర్తుపట్టేలేదా? ఆమె పేరు శరణ్య(sharanya).. కాదల్ శరణ్య.. ప్రేమ ఒక మైకం, దూసుకెళ్తా తదితర చిత్రాల్లో సహాయక పాత్రలు పోషించిన శరణ్య.. టెంత్ క్లాస్, పేరణ్మయి, మళైకాలం, రెట్టై వాలు సినిమాలలో హీరోయిన్‌గా నటించిన శరణ్య తాజాగా తమిళనాడు తిరుత్తనిలోని సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకుని గుండు గీయించుకుంది. అలాగే నాలుకపై శూలం పొడిపించుకుని మొక్కు చెల్లించుకుంది.
ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అమ్మాయిలకు జుట్టు అంటే ఎంతో ఇష్టం. అలాంటిది తన శిరోజాలను భగవంతుడి కోసం త్యాగం చేసిందంటే మెచ్చుకోవాలి అని చాలా మంది కితాబిస్తున్నారు. నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.