మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) భోళాశంకర్(Bholashankar) సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.. ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా ప్రమోషన్లను కూడా భారీగానే ప్లాన్ చేశారు టీమ్. రికార్డ్ క్రియేట్ చేయబోతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) భోళాశంకర్(Bholashankar) సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.. ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా ప్రమోషన్లను కూడా భారీగానే ప్లాన్ చేశారు టీమ్. రికార్డ్ క్రియేట్ చేయబోతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. మెహర్ రమేష్(Mehar Ramesh) డైరెక్ట్ చేసిన సినిమా భోళాం శంకర్. తమిళ సూపర్ హిట్ సినిమా వేదాళం (Vedhalam)తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈసినిమా లో తమన్నా(Tamannaah) హీరోయిన్ గా నటిస్తుండగా.. కీర్తి సురేష్(Keerthy Suresh) మెగాస్టార్ చిరంజీవి చెల్లెలి పాత్రలో కనిపించబోతోంది. అక్కినేని హీరో సుశాంత్(Shushanth) ఓ ప్రముఖ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉండగా ఈసినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యి.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

విడుదలకింకా రెండు వారాలు కూడా లేని భోళా శంకర్‌ ప్రమోషన్‌లతో ప్రేక్షకుల్లో వీర లెవల్లో హైప్‌ క్రియేట్‌ చేస్తుంది. ఇప్పటికే రిలీజైన టీజర్‌, ట్రైలర్‌లు మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపాయి. అసలే ప్లాప్ సినిమాల దర్శకుడు మోహర్ రమేష్ సినిమా చేయడంతో.. భయంగా ఉన్నా మెగాస్టార్ పై నమ్మకంతోనే ఫ్యాన్స్ భోళా శంకర్ పై నమ్మకంతో ఉన్నారు. ఈసినిమాపై ఫ్యాన్స్‌ ధీమాగా ఉన్నారు. బిజినెస్‌ లెక్కలు సైతం సాలిడ్‌ రేంజ్‌లో జరుగుతున్నాయని ఇన్‌సైడ్‌ టాక్. ఇక ఇదిలా ఉంటే రిలీజ్‌ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్‌ పీక్స్‌ లెవల్లో ప్రమోషన్‌లు చేస్తున్నారు.

తాజాగా సూర్యపేట సమీపంలోని రాజుగారి తోట రెస్టారెంట్‌ పరిసరాల్లో మెగాస్టార్‌ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కటౌట్‌ ఎత్తు దాదాపు వంద అడుగుల పైనేనని సమాచారం. అంతేకాకుండా అంత పెద్ద కటౌట్‌ టాలీవుడ్‌లో ఇదే తొలిసారని చిత్రయూనిట్‌ వెల్లడించింది. దీన్ని చూసి మెగా అభిమానులు మురిసిపోతున్నారు. ప్రస్తుతం ఈ కటౌట్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇక ఈ రెండు వారాలు చిత్రయూనిట్ వరుస ప్రమోషన్‌లతో బిజీగా గడపనుందట.

Updated On 30 July 2023 12:00 AM GMT
Ehatv

Ehatv

Next Story