✕
Who Changed Their Birth Names : సౌత్‌లో పేర్లు మార్చుకున్న 10 మంది స్టార్స్.. వాళ్ల అసలు పేర్లేంటో తెలుసా.. ?!
By EhatvPublished on 2 Jun 2023 11:41 PM GMT
చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టేముందు చాలా మంది సెలబ్రిటీలు వాళ్ల పేర్లు మార్చుకున్నారని మీకు తెలుసా.. ? సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా పలువురు తారలు తమ పేర్లు మార్చుకుని కొత్త స్టేజ్ నేమ్ ను అందుకున్నారు. అయితే వాళ్లు పేర్లు మార్చుకోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. కొందరు న్యూమరాలజీ ప్రకారం మార్చుకున్నారు, ఇంకొందరు పేరు మార్పు వలన లక్ అండ్ ఫేమ్ తీసుకొస్తుందని నమ్మారు. కొదిమంది మాత్రమే అసలు పేర్లను మార్చారు.. ఎందుకంటే పిలవడానికి చాలా కష్టంగా ఉన్న పేర్లను షార్ట్ గా పలకడానికి ఈజీగా ఉంటుందని మార్చుకున్నారు. రజినీకాంత్, మమ్ముట్టి, యష్ ఇలా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు వాళ్ల పేర్లు మార్చుకున్నారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పేర్లు మార్చుకున్న ఫేమస్ సెలబ్రీటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం..

x
Who Changed Their Birth Names
-
- చిరంజీవి (Chiranjeevi) అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. కానీ ఆయన ఫ్యామిలీ మాత్రం అతని పేరును చిరంజీవిగా మార్చారు. హనుమంతుడిని అమితంగా ఆరాధించే ఆయన తల్లి.. చిరంజీవిగా పేరు మార్చుకోవాలని సలహా ఇచ్చిందట. నాలుగు దశాబ్ధాలుకుపైగా నటుడిగా చేస్తూ.. ఆయన 150కిపైగా సినిమాల్లో నటించాడు. ఇప్పుడు ఆయన్ను తెలుగు చిత్ర పరిశ్రమంతా మెగాస్టార్ అని పిలుస్తోంది.
-
- తమిళ స్టార్ హీరో రజినీకాంత్ (Rajinikanth) అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. అయితే కె. బాలచందర్ దర్శకత్వం వహించిన అపూర్వ రాగంగల్ (1975) అనే తమిళ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి ముందు ఆయన తన పేరును మార్చుకున్నారు. శివాజీరావు గైక్వాడ్‌ను రజినీకాంత్‌గా మార్చారు డైరెక్టర్ కె. బాలచందర్. కాగా అప్పటికే నటుడు శివాజీ గణేశణ్ ఉండటంతో.. ఆయన పేరుకు ఇబ్బందికి లేకుండా ఉండే విధంగా రజినీకాంత్ అనే పేరును పెట్టారట డైరెక్టర్ కె. బాలచందర్(K.Balachander).
-
- మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి (Mammootty) అసలు పేరు ముహమ్మద్ కుట్టి పనపరంబిల్ ఇస్మాయిల్. కానీ మలయాళ చిత్ర పరిశ్రమలోకి ఎంటర్ అవ్వకముందే తన పేరును మమ్ముట్టిగా మార్చుకున్నాడు. మొదట్లో ఆ పేరును తనకు ఇష్టమైన వారు ప్రేమగా పిలిచేవారట. ఆ తర్వాత అదేపేరును స్టేజ్ నేమ్‌గా తీసుకున్నారు. అనుభవంగళ్ పాలిచకల్ (Anubhavangal Paalichakal) అనే మలయాళ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఆయన సౌత్‌లో అతిపెద్ద సూపర్ స్టార్‌గా ఎదిగారు.
-
- తమిళ స్టార్ హీరో ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరీ రాజా. 1995లో కురుతిపునాల్ (Kuruthipunal) అనే ఫిక్షనల్ కోవర్ట్ ఆపరేషన్ నుంచి ఇన్స్పైర్ అయిన తర్వాత అతను తన స్క్రీన్ నేమ్‌ను ధనుష్ (Dhanush)గా మార్చుకున్నాడు.2002లో తుళ్లువదో ఇల్లామై (Thulluvadho Ilamai) సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ధనుష్ ఇప్పటి వరకు 50 సినిమాల్లో నటించి నాలుగుసార్లు జాతీయ అవార్డు అందుకున్నారు.
-
- రేడియో జాకీగా, అసిస్టెంట్‌గా పని చేసిన తర్వాత ‘అష్టాచమ్మా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మన న్యాచురల్ స్టార్. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే నాని అసలు పేరు నవీన్ బాబు ఘంటా. ఈ దసరా నటుడు తన నిక్ నేమ్ అయిన నాని (Nani) పేరుతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
-
- విశ్వక్ సేన్ (Vishwak Sen) అసలు పేరు దినేష్ నాయుడు. అయితే ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేముందు న్యూమరాలజీ ప్రకారం పేరును మార్చుకున్నాడు. ఈయన పుట్టినప్పటి నుంచి దినేష్ నాయుడిగా పెరిగాడని.. ఎంత కష్టపడినా ఆ పేరు ఆయనకు సక్సెను తీసుకురాదని వాళ్ల నాన్న అన్నాడట. కాగా వాళ్ల నాన్న నాలుగు న్యూమరాజీ పేర్లు సజెస్ట్ చేయడంతో అందులో ఒక పేరును సెలక్ట్ చేసుకుని.. విశ్వక్ సేన్‌గా మార్చుకున్నాడట మన మాస్ కా దాస్.
-
- కేజీఎఫ్ స్టార్ యష్ (Yash)కు రెండు పేర్లు ఉన్నాయి. లీగల్ గా నవీన్ అయితే.. అతని తల్లి కుటుంబం ఆయనకు యశ్వంత్ అని పేరు పెట్టారు. సినీ పరిశ్రమలో తన కెరీర్ ను ప్రారంభించడానికి ముందు, స్టేజ్ నేమ్ కోసం చాలా మందిని సలహాలు తీసుకున్నారట. కర్నాటక నటుడికి తగ్గట్టుగా ఉండేలా అతని పేరు యశ్వంత్‌ను యష్ (Yash)గా అని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత కేజీఎఫ్ (KGF) చిత్రంతో రాకీభాయ్ క్యారెక్టర్‌తో ప్రపంచ వ్యాప్తంగా మాంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మన యష్.
-
- నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. అయితే ఆమె మలయాళీ నస్రాణి (క్రిస్టియన్) కుటుంబంలో జన్మించింది. ఆమె 2011లో హిందూ మతంలోకి మారి తనపేరును నయనతార(Nayanthara)గా మార్చుకుంది. 2003 మలయాళంలో వచ్చిన మనసినక్కరే (Manassinakkare) సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ లేడీ సూపర్ స్టార్ ఆఫ్ సౌత్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.
-
- అనుష్క (Anushka) అసలు పేరు స్వీటీ శెట్టి అని మీకు తెలుసా ? ఈ భామ నటించిన తొలి చిత్రం సూపర్ (Super)లో స్వీటీ అని అందరూ పిలుస్తుండటంతో ఈ బ్యూటీ తన పేరును మార్చుకుంది. అయితే చాలా పేర్లను పరిశీలించుకున్న తర్వాత అనుష్క (Anushka) అనే నేమ్ బావుందని ఆపేరును తన స్క్రీన్ నేమ్ మార్చుకుందట ఈ స్వీటీ.
-
- ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ కృతిశెట్టి (Krithi Shetty). ఈ భామ అసలు పేరు అద్వైత(Advaitha). అయితే తన స్టేజ్ నేమ్‌ను కృతిశెట్టిగా మార్చుకుంది. కాగా జనాలు అద్వైత అని పిలవడం తనకు నచ్చలేదని బేబమ్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

Ehatv
Next Story