మన సంస్కృతిని నాశనం చేయకండి
మన యూత్‌కు(Youth) పనీపాటా ఏమీ లేనట్టుగా ఉంది. ప్రపంచంలో మిగతా చోట్ల ఉన్న యువతీ యువకులు పనులు చేసుకుంటూనో, చదువుకుంటూనో తీరిక లేకుండా ఉన్నారు. మనవాళ్లు మాత్రం రీ రిలీజ్(re release) సినిమాలు చూస్తూ, డాన్సులు చేస్తూ, వీలైతే థియేటర్‌లో పెళ్లి(Marriage) చేసుకుంటూ బిజీగా ఉంటున్నారు. మొన్న ఆగస్టు 9వ తేదీన మహేశ్ బాబు పుట్టిన రోజు కదా! ఈ సందర్భంగా ఫ్యాన్స్ మొత్తం సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమా ఇప్పటికీ టీవీలలోనే సహస్ర దినోత్సవాలు చేసుకున్నది. ఆ సినిమాకు ఇంత హంగామానా? అది కూడా ఇన్నేసి డబ్బులు పెట్టి చూడటమా? అంటే మీరెవరు చెప్పడానికి మా ఇష్టం అంటారేమో! అంతే.. అది వారి ఇష్టం. ఈ మూవీ చూస్తూ ఓ ప్రేమ జంట థియేటర్‌లోనే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. థియేటర్‌లోకి తాళిబొట్టును తీసుకువచ్చిన అబ్బాయి మహేశ్‌బాబు(Mahesh babu) ఫ్యాన్స్ ముందు పెళ్లి చేసుకున్నాడు. ఫ్యాన్స్ కూడా ఆ పెళ్లిని చక్కగా ఎంజాయ్ చేశారు. సెల్‌ఫోన్‌లలో చిత్రీకరించి వైరల్ చేశారు. దీన్ని చాలా మంది విమర్శిస్తున్నారు. యూత్ ఏమిటీ ఇలా మారిపోయిందని కామెంట్ చేస్తున్నారు. ఈ ఘటనపై మురారి(Murari) సినిమా దర్శకుడు కృష్ణవంశీ(Krishna vamsi) కూడా స్పందించారు. ఎక్స్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు.
'కృష్ణవంశీ గారు.. మురారి మూవీలో ప్రేమ జంట పెళ్లి చేసుకుంది. మీరు అది చూశారా.?' అంటూ ఓ అభిమాని కృష్ణవంశీని ఎక్స్‌లో ప్రశ్నించాడు. దీనికి కృష్ణవంశీ రియాక్టయ్యారు. 'థియేటర్‌లో పెళ్లి చేసుకోవడం మంచిది కాదు. ఇలా చేసి మన గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను అపహాస్యం చేసి అవమానించకండి ప్లీజ్' అంటూ కృష్ణవంశీ ఎక్స్‌లో రాసుకొచ్చారు.
Not good ... Dnt ridicule n insult n abuse our great grand CULTURE and TRADITIONS plzzzzz ,🙏🙏🙏🙏 https://t.co/CoTJ0tkX3c
— Krishna Vamsi (@director_kv) August 10, 2024