లావణ్య షాకింగ్‌ కామెంట్స్‌

హీరో రాజ్‌తరుణ్‌(Raj tharun), లావణ్య చౌదరిల(Lavnaya Cowdhary) వ్యవహారం పూటకో టర్న్‌ తీసుకుంటోంది. తనతో అన్నేళ్ల పాటు గడిపి, పెళ్లి చేసుకుని, గర్భవతిని చేసి, ఆపై అబార్షన్‌ చేసిన రాజ్‌తరుణ్‌ పచ్చి మోసగాడని లావణ్య చౌదరి ఆరోపిస్తోంది. అయితే లావణ్యనే తనను మోసం చేసిందని, డ్రగ్స్‌కు బాసిన అయ్యిందని, మరొకరితో సంబంధం పెట్టుకున్నదని రాజ్‌తరుణ్‌ అంటున్నాడు. ఈ వివాదంలో మస్తాన్‌ సాయి(Mastan Sai) పేరు కూడా చాలా రోజులుగా వినిపిస్తూ వస్తోంది. మొదట్లో మస్తాన్‌ సాయి తన ఫ్రెండ్‌ అని చెప్పిన లావణ్య తర్వాత గుంటూరు నగరం పాలెం పోలీస్‌స్టేషన్‌లో మస్తాన్‌ సాయిపై కంప్లయింట్‌ చేసింది. లేటెస్ట్‌గా మస్తాన్‌ సాయిని డ్రగ్‌ కేసులో(Drugs case) విజయవాడ పోలీసులు(Vijayawada police) అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. అతడి కాంటాక్ట్స్‌పై ఆరా తీస్తున్నారు. ఎవరెవరికి డ్రగ్స్‌ సప్లై చేశాడు? సినిమావాళ్లతో సంబంధాలు ఏమైనా ఉన్నయా? అన్నది తెలుసుకుంటున్నారు. మస్తాన్‌ సాయి ఫోన్‌లో అనేక మంది అమ్మాయిల వీడియోలు ఉండటం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. తాజాగా మస్తాన్‌ సాయిపై లావణ్య షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. మస్తాన్‌ సాయి దగ్గర తన ప్రైవేటు వీడియో(Personal videos) ఉందని లావణ్య చెప్పింది. ఏప్రిల్ 2023లో తన సోదరి పెళ్లి కోసం లావణ్యను గుంటూరుకు రమ్మన్నాడు మస్తాన్‌ సాయి. పెళ్లికి వచ్చిన లావణ్యను ఓ హోటల్‌లో ఉంచాడు మస్తాన్‌ సాయి. హోటల్‌ గదిలో ఉన్న లావణ్యను మస్తాన్‌ సాయి కొట్టి, ఆమె ఫోన్‌ లాక్కొని అత్యాచారం(Rape) చేశాడట! ఈ విషయాన్ని లావణ్య చెప్పుకొచ్చింది. మస్తాన్ సాయి మొబైల్‌లో తన ప్రైవేటు వీడియో కూడా ఉందన్నారు లావణ్య చౌదరి. అలాగే ఈ విషయం రాజ్‌తరుణ్ కు కూడా తెలుసు అని చెప్పుకొచ్చింది లావణ్య.

Eha Tv

Eha Tv

Next Story