Beautiful Women in Pakistan : ఈ భూమ్మీద అత్యంత అందమైన అమ్మాయిలు ఎక్కడుంటారో తెలుసా?
ప్రపంచంలో అత్యంత అందమైన అమ్మాయిలు(Beautiful Women) ఎక్కడుంటారనే సందేహం చాలాసార్లు వచ్చే ఉంటుంది. ఆర్మేనియా(Armenia) అమ్మాయిలు అందంగా ఉంటారని అంటుంటారు. అలాగే తుర్కియా(Turkia) దేశపు అమ్మాయిల అందమే అందమని చెబుతుంటారు.

Beautiful Women in Pakistan
ప్రపంచంలో అత్యంత అందమైన అమ్మాయిలు(Beautiful Women) ఎక్కడుంటారనే సందేహం చాలాసార్లు వచ్చే ఉంటుంది. ఆర్మేనియా(Armenia) అమ్మాయిలు అందంగా ఉంటారని అంటుంటారు. అలాగే తుర్కియా(Turkia) దేశపు అమ్మాయిల అందమే అందమని చెబుతుంటారు. కానీ అత్యంత అందమైన అమ్మాయిలు మన పక్కనున్న పాకిస్తాన్‌లో(Pakistan) ఉంటారట! పాకిస్తాన్‌లో హుంజా వ్యాలీ(Hunza Valley) అనే ప్రదేశం ఉంది. అక్కడ మహిళలు 80 ఏళ్ల వయసులో కూడా యవ్వనంగా, ఎంతో అందంగా, ఆకర్షణీయంగా, ఆకట్టుకునేలా కనిపిస్తారు. అందంగానే కాదు ఆరోగ్యంగానూ ఉంటారు. 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా తల్లులయ్యే సామర్థ్యం వీరికి ఉంది. అందుకు కారణం వారి జీవనశైలి(Life Style). అందుకే ఇక్కడి మహిళలు వందేళ్లకు పైగా జీవిస్తున్నారు.
వీరికి రోగాలు రోష్టులు కూడా రావట! ఎప్పుడో కానీ అనారోగ్యానికి గురి కారట!దీనికి కారణమేమో ఇక్కడ ప్రవహించే నదిలో ఆరోగ్యాన్ని పెంపొందించే ఖనిజాలు ఉండటం. హుంజా వ్యాలీ ప్రజలు మిత ఆహారం తీసుకుంటారు. మధ్యాహ్నం ఓసారి భోజనం చేస్తారు. రాత్రిపూట తక్కువగా తింటారు. ఇక్కడి ప్రజలు ఇక్కడివారినే పెళ్లి చేసుకుంటారు. వ్యవసాయం(Agriculture) వీరి ప్రధాన వృత్తి. అన్నట్టు ఎరువులు, పురుగు మందులు వాడనే వాడరు! స్వచ్ఛమైన ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుని దాన్నే తింటారు. ఆయుర్దాయం ఎక్కువగా ఉన్న ప్రదేశాలను బ్లూ జోన్‌లుగా పిలుస్తారు. హుంజా వ్యాలీ కూడా ఇలాంటిదే! చివరగా చెప్పేదేమిటంటే హుంజా వ్యాలీ ప్రజలు మాంసాహారానికి(Non-Veg) చాలా దూరంగా ఉంటారు.
