Sex worker story : హృదయాన్ని కదలిస్తున్న ఓ వేశ్య కథ.. నెట్టింట్లో వైరల్..!
ఒక సెక్స్ వర్కర్‌కి సంబంధించిన కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ఒక సెక్స్ వర్కర్‌కి సంబంధించిన కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆమెకు 16 ఏళ్లు ఉన్నప్పుడు తన మేనమామ సెక్స్ రాకెట్‌కు ఆమెను విక్రయించాడు. ఆమె 15ఏళ్ల పాటు ఇంటికి సెక్స్ వృత్తిలో కొనసాగింది. ఇప్పుడు ఇంటికి వెళ్లే అవకాశం రావడంతో.. ఆమె తన సొంత ఇంటికి వెళ్లడంతో విషాదరకరమైన సంఘటన ఆమెకు ఎదురైంది. సొంత కుటుంబసభ్యులు ఇంట్లోకి రానివ్వలేదు. అనీష్ భగత్ అనే కంటెంట్ క్రియేటర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ వీడియోతో ఆ మహిళ కథ బయటకు వచ్చింది. ఈ వీడియో ఇప్పటికే కొన్ని లక్షల్లో వ్యూస్ సంపాదించుకుంది. ఆమె తన చిన్నతనం నుంచి ఎదరైన చేదు అనుభవాలను పంచుకుంది. సొంత మామ తనని 16ఏళ్ల వయస్సులో 'సెక్స్ ట్రేడ్'లో విక్రయించినట్టు వెల్లడించింది. ఆ తర్వాత చాలా కష్టాలు పడినట్టు పేర్కొంది.
15ఏళ్ల తర్వాత ఆ మహిళ, తన ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. తోటి సెక్స్ వర్కర్లు ఆమె వద్దకు వెళ్లి చిన్న చిన్న బహుమతులు కూడా ఇచ్చిన ఘనంగా వీడ్కోలు పలికారు. తమలో ఒకరు చాలా కాలం తర్వాత ఇంటికి తిరిగి వెళుతున్నారని సంతోషించారు. ఇంటికి వెళ్లే దారిలో ఆ మహిళ ఒక షాప్‌లో ఆగి తన తల్లి కోసం చీర కూడా కొనుక్కుంది. తన అన్న కోసం ఒక వాచ్ కూడా కొంది. తన తండ్రి బతికి లేడని మహిళ వెల్లడించింది. భగత్‌తో కలిసి ఆ మహిళ తన గ్రామానికి వెళ్లింది. ఇంటికి సమీపానికి వెళ్లేసరికి భావోద్వేగానికి లోనైంది. 15ఏళ్ల తర్వాత తన వాళ్లను చూస్తున్నానని ఆనందంగా తన ఇంటికి వెళ్లపోయింది. కానీ అక్కడ మాత్రం ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. మహిళను ఆమె ఇంటి సభ్యులు లోపలికి రానివ్వలేదు. తన మొహం మీదే తలుపు వేసేశారు. చుట్టుపక్కలవారు ఎలా మాట్లాడుకుంటారోనన్న భయంతో మహిళను ఆమె కుటుంబసభ్యులు ఇంట్లోకి రానివ్వడానికి అనుమతించలేదని," అని భగత్ చేసిన పోస్ట్ క్యాప్షన్‌లో రాసి ఉంది. "నేను ఈ జీవితాన్ని ఎంచుకోలేదు. కానీ నేనే కావాలని చేసినట్టు నన్ను చూశారు," అని అంటూ ఆ మహిళ కన్నీరు పెట్టుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మహిళకు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే ఆ మహిళను ఈ రొంపిలోకి పంపించిన మామ మాత్రం ఆనందంగా బతుకుతున్నాడు. కుటుంబమే ఆమె జీవితాన్ని నాశనం చేసిందని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
