సాధారణంగా చలికాలంలో(Winter season) శరీర ఉష్ణోగ్రతలు(Body temperatures) తగ్గుతుంటాయి. వాతావరణాన్నిబట్టి శరీరంలో వేడిని అదుపులో ఉంచడానికి గుండె(Heart) మరింత కష్టపడాలి. రక్త నాళాలు సన్నగా ఉంటాయి కాబట్టి మెదడు, ఇతర అవయవాలకు రక్త ప్రసరణ చేయడంపై గుండె దృష్టిపెడుతుంది. దీని కోసం సాధారణ సమయం కంటే గుండె ఎక్కువగా కష్టపడుతుంటుంది. శీతాకాలంలో రక్త పోటు(Blood pressure) పెరుగుదలతో పాటు రక్తం చిక్కగా మారుతుందంటున్నారు వైద్య నిపుణులు.
సాధారణంగా చలికాలంలో(Winter season) శరీర ఉష్ణోగ్రతలు(Body temperatures) తగ్గుతుంటాయి. వాతావరణాన్నిబట్టి శరీరంలో వేడిని అదుపులో ఉంచడానికి గుండె(Heart) మరింత కష్టపడాలి. రక్త నాళాలు సన్నగా ఉంటాయి కాబట్టి మెదడు, ఇతర అవయవాలకు రక్త ప్రసరణ చేయడంపై గుండె దృష్టిపెడుతుంది. దీని కోసం సాధారణ సమయం కంటే గుండె ఎక్కువగా కష్టపడుతుంటుంది. శీతాకాలంలో రక్త పోటు(Blood pressure) పెరుగుదలతో పాటు రక్తం చిక్కగా మారుతుందంటున్నారు వైద్య నిపుణులు. దీని వల్ల శీతాకాలంలోనే గుండె పోట్లు అధికంగా వచ్చే అవకాశం ఉందంటున్నారు.
సాధ్యమైనంత వరకు మీరు ఉండే గదిలో మినిమిమ్ 18 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. వెచ్చని దుస్తులు(Warm clothes) ధరించడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత అదుపులో ఉంటుందని చెప్తున్నారు. గదిలో ఉంటున్నా కానీ మీరు అటు, ఇటు నడవాలని చెప్తున్నారు. వేడివేడి భోజనం(Hot meals), వేడి నీళ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. కూరగాయలతో చేసిన వేడి సూప్(Veg hot soup) తాగాలంటున్నారు. చల్లని గాలిని(Cold Breeze) పీల్చడం వల్ల గుండెపోట్లు(Heart attack) వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. హార్ట్ డిసీజ్‌లు ఉన్నట్లయితే వెచ్చని ప్రదేశాల్లో ఉండడం చాలా ముఖ్యమంటున్నారు. సైక్లింగ్ చేయడం వల్ల రక్త సరఫరాను మెరుగుపర్చుకోవాలని సూచిస్తున్నారు. చల్లని ప్రదేశాల్లో వ్యాయామం కూడా అంత మంచిది కాదంటున్నారు.