చలికాలంలో చల్లటి నీటితో స్నానం చేయడం అంత సులభం కాదు.

చలికాలంలో చల్లటి నీటితో స్నానం చేయడం అంత సులభం కాదు. చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేస్తుంటారు. స్నానాలకే కాదు, ఇతర పనులకు కూడా చాలా మంది వేడి నీళ్లను వినియోగిస్తున్నారు. కొందరు హీటర్లను ఉపయోగిస్తే, మరికొందరు గీజర్లను ఉపయోగిస్తారు. అయితే, గీజర్‌ను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే గీజర్ పేలవచ్చు. తాజాగా గీజర్ పేలి ఓ నవ వధువు మృతి చెందింది. అందువల్ల, గీజర్‌ను సురక్షితంగా ఉపయోగించడం కోసం కొన్ని చిట్కాలను తెలుసుకుందాం. గీజర్ ఉపయోగించడం కష్టం కాదు. ఇది నిమిషాల్లో నీటిని వేడి చేస్తుంది. అందువల్ల, చాలా మంది దీనిని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోరు, ఎందుకంటే ఇది ప్రమాదకరం కాదని వారు నమ్ముతారు. అయితే గీజర్‌ను ఉపయోగించేటప్పుడు జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. లేకపోతే, ఇది వివిధ సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి, గీజర్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

గీజర్‌ని ఆన్‌లో ఉంచవద్దు

చాలా మంది గీజర్‌ని వదిలేసి దాని గురించి మర్చిచిపోతారు. ఇది గీజర్ పేలడానికి కారణం కావచ్చు. కరెంటు బిల్లు కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి, అవసరమైనప్పుడు మాత్రమే ఆన్ చేసి, ఆ తర్వాత ఆఫ్ చేయాలి.

ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఉపయోగించాలి

గీజర్‌ను కొనుగోలు చేసేటప్పుడు, అది మంచి నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉందో లేదో చెక్ చేయాలి. చాలా మంది నీరు వేడిగా ఉన్న తర్వాత కూడా గీజర్‌ని ఆన్ చేసి స్నానం చేస్తారు. అయితే దీని వల్ల విద్యుత్ షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి గీజర్ ఆఫ్ చేసిన తర్వాతే వేడి నీటిని వాడాలి. గీజర్లు వివిధ ధరల శ్రేణులలో వస్తాయి. చాలా మంది తక్కువ ధరకే గీజర్లను కొంటారు. అయితే, భద్రత కోసం, ధృవీకరించబడిన కంపెనీల నుండి గీజర్లను కొనుగోలు చేయాలి. దీంతో ప్రమాదాలు తగ్గుతాయి.

దాన్ని సర్వీస్ చేయించుకోండి

చలికాలంలో గీజర్లను ఎక్కువగా ఉపయోగిస్తారు. అందువల్ల, ప్రతిరోజూ గీజర్‌ను ఆన్ చేసే ముందు విద్యుత్ కనెక్షన్‌ను తనిఖీ చేయండి. గీజర్ యొక్క ఉష్ణోగ్రత 45-50 డిగ్రీల మధ్య ఉంచండి. సర్వీసింగ్ తర్వాత మాత్రమే దీన్ని ఉపయోగించండి. కొన్నిసార్లు గీజర్ నుంచి వింత శబ్దాలు రావచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అటువంటి శబ్దాలను విస్మరించకూడదని, వెంటనే దానికి సంబంధించిన నిపుణులను పిలిపించి చెక్‌ చేయించాలి.

ehatv

ehatv

Next Story