Elections Business : ఎన్నికల వేళ ....ముక్కకు, చుక్కకు ఫుల్లు గిరాకీ
ఎన్నికలు(Elections) సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలో టెన్షన్ అంతకంతకూ పెరుగుతుంది. పార్టీల అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. అయితే తమ వెంట తిరుగుతున్న కార్యకర్తలకు దసరా పండుగ ముందుగానే వచ్చిందని చెప్పాలి. ఉదయం నుంచి రాత్రి వరకు అభ్యర్థుల వెంట జెండాలు మోస్తూ తిరిగే కార్యకర్తలకు మంచి, మర్యాద ఉంటుంది కదా..!
ఎన్నికలు(Elections) సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలో టెన్షన్ అంతకంతకూ పెరుగుతుంది. పార్టీల అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. అయితే తమ వెంట తిరుగుతున్న కార్యకర్తలకు దసరా పండుగ ముందుగానే వచ్చిందని చెప్పాలి. ఉదయం నుంచి రాత్రి వరకు అభ్యర్థుల వెంట జెండాలు మోస్తూ తిరిగే కార్యకర్తలకు మంచి, మర్యాద ఉంటుంది కదా..! పార్టీల కార్యకర్తలకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ముందు చుక్కను ఏర్పాటు చేస్తున్నారు ఆయా పార్టీల అభ్యర్థులు.
పలు ప్రాంతాల్లో అయితే కార్యకర్తలకు రెండు పూటలా హైదరాబాద్ ప్రత్యేక వంటకాలతో భోజనాలు కూడా ఆఫర్ చేస్తున్నారు. కొందరు అభ్యర్థులు నాన్‌వెజ్, ఇంకొదరు వెజ్ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు.
హోటళ్లు(Hotels), మద్యం షాపులు(Wine Shops), టైలరింగ్ షాపులు కళకళలాడుతున్నాయి. పలువురు అభ్యర్థులు ముందుగానే మద్యం షాపులకు నగదు పంపించి అవసరమైన స్టాక్ తెచ్చిపెట్టుకోవాలని ఇప్పటికే చెప్పారట. ప్రతిరోజు తమ వెంట ఉండే కార్యకర్తలకు భోజనం, మద్యం అవసరమైతే కొంత నగదు ఇవ్వడంతో పార్టీల జెండాలు మోస్తూ అభ్యర్థులకు జిందాబాద్‌లు కొడుతున్నారు కార్యకర్తలు. ఎవరు గెలుస్తారో తెలియదు కానీ కార్యకర్తలకు మాత్రం పండగే పండగ అన్నమాట.
మరోవైపు రాజకీయ నాయకులు, కార్యకర్తలందరూ ప్రచారం కోసం ప్రజల్లోకి వెళ్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా షేర్వానీ, కుర్తా పైజామా దుస్తులను ప్రత్యేకించి ఆర్డర్ ఇచ్చిన మరీ కుట్టించుకుంటున్నారు. నాయకులు ఖరీదైన బట్టలతోపాటు షేర్వానీలు కుట్టించుకునేందుకు ఇష్టపడుతుండటంతో.. టైలర్ల దగ్గర విపరీతంగా గిరాకీ పెరిగిపోతుంది. దీంతో టైలర్లు(Tailors) కూడా కాంట్రాక్ట్ బేస్ మీద బట్టలు కుట్టిస్తున్న పరిస్థితి నెలకొంది. ఒక షేర్వాణి కుట్టాలంటే ఒక్కొక్క టైలర్ దగ్గర ఒక్కో రేటు చెబుతున్నారు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని పలువురు నేతలు ముందుగానే బట్టలు కుట్టించుకుని రెడీగా ఉన్నప్పటికీ, టికెట్ రాకపోవడంతో టైలర్ దగ్గర నుంచి బట్టలు తీసుకునే పరిస్థితి లేదు.