Keyboard : మీ కంప్యూటర్ కీ బోర్డులో F-J కింద ఒక గీతను పరిశీలించారా..?
ప్రపంచాన్ని కంప్యూటర్(Computer) శాశిస్తోంది. ప్రతి చోట కంప్యూటర్ లేనిదే ఏ పనీ జరగదు.
ప్రపంచాన్ని కంప్యూటర్(Computer) శాశిస్తోంది. ప్రతి చోట కంప్యూటర్ లేనిదే ఏ పనీ జరగదు. స్కూల్ విద్యార్థి నుంచి కార్పొరేట్ కంపెనీ వరకు కంప్యూటర్ వాడాల్సిందే. అయితే కంప్యూటర్ కీబోర్డులోని(keyboard) F, J లెటర్స్ కింద ఒక గీత ఉంటుంది. దానిని ఎప్పుడైనా పరిశీలించారా.. లేదా.. అలా ఎందుకు ఉంటుందో ఆలోచించారా అనేది చూద్దాం. నిజానికి F, J లెటర్స్ కీబోర్డుకు మధ్యలో ఉంటాయి. టైపింగ్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఎడమచేతి చూపుడు వేలు, కుడి చేతి చూపుడు వేలు వాటిపై ఉంచి ప్రాక్టీస్ చేయడం ప్రారంభిస్తారు. F, J లెటర్ల కింద గీత ఉండడంతో మిగతా వేళ్లు కూడా టైపింగ్‌లో ఫాస్ట్‌గా కదులుతాయి. టైపింగ్ మార్క్స్‌లో ఇవి కీలకంగా ఉంటాయి. టైపింగ్ ప్రారంభించడానికి కీబోర్డ్‌పై వేళ్లను సరిగ్గా ఉంచడం గురించి టైపిస్ట్‌కు తెలియజేయడంలో ఈ గుర్తులు సహాయపడతాయి. ఈ బటన్లు కరెక్ట్‌గా కీబోర్డు మధ్యలో ఉండడంతో వాటి చుట్టూ ఉన్న బటన్లు ఉపయోగించడానికి సులభంగా ఉంటుంది. ఈ బటన్‌లపై వేళ్లు పెట్టిన వెంటనే చూడకుండా ఇతర బటన్ల సహాయంతో టైపింగ్ స్పీడ్, కచ్చితత్వం ఏర్పడుతుంది.