హిందూ సంప్రదాయంలో పితృపక్షానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దాదాపు 15 రోజుల పాటు ఉండే ఈ పితృపక్షంలో మన పూర్వీకులు తిరిగి మన వద్దకు.. భూవిపైకి వస్తారని ఓ నమ్మకం ఉంది. అందుకే ఈ పదిహేను రోజులలో పిండ ప్రదానం, తర్పణం, శ్రాద్ధం వంటివి చేయడం చాలా ముఖ్యమైన విధిగా భావిస్తారు. కానీ మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు పితృదోషానికి గురిచేస్తాయి. ముఖ్యంగా మన ఇంటి దిక్కులు కూడా పూర్వీకులకే అంకితం అని పెద్దలు చెబుతుంటారు.

హిందూ సంప్రదాయంలో పితృపక్షానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దాదాపు 15 రోజుల పాటు ఉండే ఈ పితృపక్షంలో మన పూర్వీకులు తిరిగి మన వద్దకు.. భూవిపైకి వస్తారని ఓ నమ్మకం ఉంది. అందుకే ఈ పదిహేను రోజులలో పిండ ప్రదానం, తర్పణం, శ్రాద్ధం వంటివి చేయడం చాలా ముఖ్యమైన విధిగా భావిస్తారు. కానీ మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు పితృదోషానికి గురిచేస్తాయి. ముఖ్యంగా మన ఇంటి దిక్కులు కూడా పూర్వీకులకే అంకితం అని పెద్దలు చెబుతుంటారు. అందుకే ఇంటి దిక్కులు.. ఫోటోస్ విషయంలో మనం ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంట్లో ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ప్రముఖ జ్యోతిష్కుడు, వాస్తు నిపుణుడు పండిట్ రిషికాంత్ మిశ్రా నుండి , పిత్రా దోషాన్ని నివారించే మార్గాలు, ఏ నియమాలను పాటించాలో సూచించారు. అవెంటో తెలుసుకుందామా.

ఇళ్లు.. అలాగే ఇంట్లో దిక్కులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, దక్షిణ దిశ చాలా శుభం అంటారు. ఈ దిక్కులో యమధర్మరాజుకు చెందనిది అంటారు. అందుకే ఆ దిశలో పూర్వీకుల ఫోటోలను ఉంచడం సరైనది. అయితే ఫోటోను ఉంచేటప్పుడు పూర్వీకులు దక్షిణ దిశలో ఉండాలి. మరోక విషయం ఫోటోను ఉత్తర గోడపై మాత్రమే ఉండాలి.

ఫోటోస్ ఈ దిశలో పెట్టకూడదు..
ఇంట్లోని పడకగదిలో లేదా డ్రాయింగ్ రూమ్‌లో పూర్వీకుల ఫోటోలను పెట్టకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ ప్రదేశాలలో ఫోటోలు పెట్టడం వల్ల ఇంటి సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అలాగే ఇంటి సభ్యులు అనారోగ్యానికి గురికావడం, ఆర్థిక సమస్యలు వెంటాడం జరుగుతుంది.

ఇంట్లో ఎన్ని ఫోటోలు ఉండాలి ?..
వాస్తు శాస్త్రం ప్రకారం పూర్వీకుల ఫోటోలు ఇంట్లో ఉంచే ముందు కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం. ఇంట్లో పూర్వీకుల ఫోటోలు ఒకటి కంటే ఎక్కువ పెట్టాలి. ఒకటి కంటే ఎక్కువ ఫోటోలు ఉంటే ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీలు ప్రవేశించే అవకాశం ఉంది. 15 రోజుల పాటు ఉండే ఈ పితృపక్షానికి విశేష ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం పూర్వీకుల శ్రాద్ధం చేయడం ద్వారా వారు సంతోషంగా ఉంటారు.

Updated On 6 Jun 2023 1:44 AM GMT
Ehatv

Ehatv

Next Story