భారతదేశంలో ప్రతి సంవత్సరం గర్భాశయ క్యాన్సర్‌తో(Cervical cancer) 1.25 లక్షల కేసులు నమోదవతుండగా 75,000 మరణాలు(Death) సంభవిస్తున్నాయి.
మహిళల్లో(Women) గర్భాశయ క్యాన్సర్ పెను ప్రమాదంగా మారిందంటున్నారు. 21-30 సంవత్సరాల మధ్య, వారు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పాప్ పరీక్ష(Pap test) చేయించుకోవాలని మహిళలకు సూచిస్తున్నారు.
భారతదేశంలో ప్రతి సంవత్సరం గర్భాశయ క్యాన్సర్‌తో(Cervical cancer) 1.25 లక్షల కేసులు నమోదవతుండగా 75,000 మరణాలు(Death) సంభవిస్తున్నాయి.
మహిళల్లో(Women) గర్భాశయ క్యాన్సర్ పెను ప్రమాదంగా మారిందంటున్నారు. 21-30 సంవత్సరాల మధ్య, వారు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పాప్ పరీక్ష(Pap test) చేయించుకోవాలని మహిళలకు సూచిస్తున్నారు. 30-64 సంవత్సరాల మధ్య, ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక పాప్ పరీక్ష మరియు HPV పరీక్ష చేయాలి. 65 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు, వైద్యుడిని సంప్రదించండి. మీరు లైంగికంగా పాల్గొంటుంటే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పరీక్ష చేయించుకోండి.
గర్భాశయ క్యాన్సర్‌కు ముఖ్య కారణం హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV). ఒకరి కంటే ఎక్కువ మందితో సెక్స్‌లో పాల్గొన్నవారికి ఈ హెచ్‌పీవీ వైరస్ సోకే ప్రమాదం ఎక్కువ ఉందని నిపుణులు చెప్తున్నారు. కొన్ని సందర్బాల్లో హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్ మనిషి శరీరం నుంచి దానంతటే అదే వెళ్లిపోతుంది. అయినా ఇన్ఫెక్షన్ ఉంటే.. జననేంద్రియ కురుపులు, గర్భాశయ, పురుషాంగం మరియు నోటి క్యాన్సర్‌కు(Throat Cancer) దారితీస్తుంది.
రొమ్ము , అండాశయ క్యాన్సర్‌లాగా వంశపారంపర్యంగా సర్వైకల్ క్యాన్సర్ రాదు. HPV ఇన్ఫెక్షన్ వల్లనే వస్తుంది. గర్భాశయ క్యాన్సర్ రాకుండ ఆఅడ్డుకునేందుకు యువతులకు 15 ఏళ్లలోపు HPV వ్యాక్సిన్ వేసుకోవాలని.. లేదా 27 ఏళ్లలోపు వ్యాక్సిన్ వేయించుకోవాలని నిపుణులు చెప్తున్నారు. 45 ఏళ్లు దాటినవారు గతంలో వ్యాక్సిన్ పొందకపోతే.. రెగ్యులర్‌గా హెచ్‌పీవీ, పాప్ సీమర్ పరీక్షల చేయించుకోవాలని అంటున్నారు.
చాలావరకు గర్భాశయ క్యాన్సర్‌లు లైంగికంగా సంక్రమించే HPV వైరస్ వల్ల సంభవిస్తాయంటున్నారు. హెచ్‌పీవీ వైరస్ అనేక రకాలుగా ఉన్నాయన్నారు. ఇందులో కొన్ని గర్భాశయ క్యాన్సర్‌కు దారితీస్తాయని చెప్తున్నారు. లక్షణాలు లేని ఆడవారిలో గర్భాశయ ముఖద్వారంలో ఏవైనా అసాధారణ కణ మార్పులు జరుగుతున్నాయో లేదో తెలుసుకోవడానికి స్క్రీనింగ్ పరీక్ష చేస్తారు. ఎలాంటి లక్షణాలు లేకున్నా కానీ కొన్ని అబ్‌నార్మల్ కణాలు పరీక్షల్లో బయటపడుతాయన్నారు.