silk smitha : సిల్క్‌స్మిత బలవన్మరణానికి కారణాలేంటి..!
సినీ ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన హీరోయిన్లలో కొందరు ఉంటే అందులో సిల్క్‌స్మిత ఒకరు.

సిల్క్ స్మిత మొదటి చిత్రము తమిళంలో వండి చక్రం (బండి చక్రం). 1979లో విడుదలైన ఈ చిత్రంలో ఆమె పాత్ర పేరు సిల్క్, బహుళ ప్రజాదరణ పోందడంతో ఆమె తన పేరును సిల్క్ స్మిత గా మార్చుకుంది. ఆమె తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషలలో 200లకు పైగా సినిమాలలో నటించింది. క్రమంగా ఆమె సినీరంగలో ప్రముఖనటిగా నిలదొక్కుకుంది. 200లకు పైగా తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలలో నటించింది. అనేక సినిమాలలో ఆమె ప్రత్యేక గీతాలు, శృంగార నృత్యాలు అమెకు అత్యంత జనాదరణను తెచ్చి పెట్టాయి. ఉదాహరణకు తెలుగులో "బావలు సయ్యా, మరదలు సయ్యా" పాట విశేష ఆదరన పొందింది. కొందరు సినిమా విలేఖరులు, విమర్శకులు ఆమెను "soft porn" actress గా అభివర్ణించారు. ఎక్కువ చిత్రాలలో ఆమె ఇతరులను వలలో వేసుకొనే అమ్మాయిగా, నర్తకిగా, ప్రేక్షకులను ఉర్రూతలూగించే నృత్యాలతోను, కామోద్దీపనము కలిగించే దుస్తులతో కనిపించింది. అయితే "సీతాకోక చిలుక" (1981) వంటి కొన్ని చిత్రాలలో నటనాప్రధానమైన పాత్రల్లో నటించి మెప్పించింది. "లయనం" అనే "పెద్దల సినిమా" ఆమెకు చాలా పేరును తెచ్చింది. "రేష్మా కీ జవానీ" అనే పేరుతో దీనిని హిందీలో తీశారు. "వసంత కోకిల" చిత్రంలో ఆమె పాత్ర విమర్శకుల మన్ననలు పొందింది.
తొలుత ఆమె డైలాగులు చెప్పడంలో ఇబ్బంది పడేది. ఎవరైనా డైలాగులు చెప్తే వాటిని గుర్తుంచుకొని చెప్పేది. 19980 నుంచి 1990 వరకు దాదాపు చాలా సినిమాల్లో నటించింది. స్మిత డ్యాన్స్ ఉంటే చాలు సినిమా హిట్ అన్నట్లుగా ఆమె కెరీర్ కొనసాగింది. ఆ తర్వాత తనను తాను మల్చుకుంటూ ఇంగ్లీష్‌లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించింది. ఈ సమయంలోనే తనకు విశాఖకు చెందిన ఓ డాక్టర్ పరిచయమ్యాడు. తన అభిమానిని అని ఆమెకు చెప్పాడు. ఆమె కోసం ఏదైనా చేస్తా అన్నట్లు నమ్మించాడు. దీంతో ఆ వ్యక్తిని స్మిత నమ్మింది. చివరికి అతనికి పెళ్లయింది, పిల్లలున్నారు అని తెలిసికూడా ఆమె అతడిని వదులుకోలేదు. ఏకంగా తన కుటుంబాన్ని తెచ్చి స్మిత ఇంట్లోనే కాపురం పెట్టాడు. స్మితకు సంబంధించిన షెడ్యూళ్లు, ఆమె డేట్స్, ఆమె ఆర్థిక లావాదేవీలన్నీ తన గుప్పిట్లోనే పెట్టుకున్నాడు. స్మిత కూడా అతన్ని విపరీతంగా నమ్మింది. రోజురోజుకు ఆమెపై అతడి పెత్తనం పెరిగిపోయింది. తన గీత దాటనిచ్చేవాడు కాదు. ఈ సమయంలోనే ఆమె నిర్మాతగా మారింది. రెండు సినిమాలు తీసి పూర్తిగా ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో అతనికి, ఆమెకు మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. ఈ సమయంలోనే స్మిత డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. అయినా తనకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. బావాబావమరిది సినిమాతో మళ్లీ తన ఆర్థిక నష్టాలను పూరించుకుంటోంది. అయినా ఇంట్లో గొడవలు సద్దుమణగలేదు. ఆ సమయంలోనే అతడిని వదిలించుకున్నా ఇంకొంత కాలం స్మిత ప్రేక్షకులను అలరించేది. గొడవలు పెరగడంతో విడిపోదాం అని అతను చెప్పడంతో స్మిత కృంగిపోయింది. 1996 సెప్టెంబర్ 22న తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు అతడే కారణమని సూసైడ్ నోట్ రాసినా పోలీసులు విచారించి.. ఆమె ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని నిర్ధారించారు. ఆ విధంగా సౌతిండియా ప్రేక్షకులకు ఓ అందాల తార దూరమైపోయింది. 36 ఏళ్ల వయసులోనే ఆమె తనువు చాలించడం విచారకరం.
