ఫ్రిజ్‌(Fridge)లో పెట్టిన ఫుడ్డును వేడి చేసి తింటున్నారా? అయితే ప్రమాదమే! లేనిపోని రోగాలను ఒంట్లోకి, సమస్యలను ఇంట్లోకి తెచ్చుకున్నట్టే! ఒకసారి వండిన ఆహారాన్ని మళ్లీ మళ్లీ వేడి చేసి తినవద్దని డాక్టర్లు ఎంత మొత్తుకున్నా చాలా మంది చెవికెక్కించుకోవడం లేదు. ఈమధ్యే ఓ వ్యక్తి ఫ్రైడ్‌ రైస్‌ తిని చనిపోయాడు. ఫ్రైడ్‌ రైస్‌ సిండ్రోమ్‌(Fried Rice Syndrome) కారణంగా మరణించాడు.

ఫ్రిజ్‌(Fridge)లో పెట్టిన ఫుడ్డును వేడి చేసి తింటున్నారా? అయితే ప్రమాదమే! లేనిపోని రోగాలను ఒంట్లోకి, సమస్యలను ఇంట్లోకి తెచ్చుకున్నట్టే! ఒకసారి వండిన ఆహారాన్ని మళ్లీ మళ్లీ వేడి చేసి తినవద్దని డాక్టర్లు ఎంత మొత్తుకున్నా చాలా మంది చెవికెక్కించుకోవడం లేదు. ఈమధ్యే ఓ వ్యక్తి ఫ్రైడ్‌ రైస్‌ తిని చనిపోయాడు. ఫ్రైడ్‌ రైస్‌ సిండ్రోమ్‌(Fried Rice Syndrome) కారణంగా మరణించాడు. ఇంతకీ ఫ్రైడ్‌రైస్‌ సిండ్రోమ్‌ అంటే ఏమిటీ? ఫ్రైడ్‌ రైస్‌ తినడం వల్ల చనిపోతామా? అంటే గ్రహచారం బాగోలేకపోతే చనిపోవచ్చు. అసలు ఫ్రైడ్‌ రైస్‌ సిండ్రోమ్‌ అంటూ ఒకటుంటుందని మొదటిసారిగా 2008లో కనిపెట్టారు. 20 ఏళ్ల ఓ యువకుడు నూడల్స్‌ వండుకుని తిన్నాడు.. మిలిగింది ఫ్రిజ్‌లో పెట్టాడు. అయిదు రోజుల తర్వాత ఆ మిగిలిపోయిన ఫుడ్డును మళ్లీ వేడి చేసుకుని తిన్నాడు. ఆ ఫుడ్డు కాస్త పాయిజన్‌ అయ్యి ప్రాణాలు కోల్పోయాడు. ఫ్రైడ్‌రైస్‌ సిండ్రోమ్‌ అనేది ఆహారం ద్వారా వచ్చే వ్యాధి. బాసిల్లస్‌ సెరియస్‌ (Bacillus cereus)అనే బ్యాక్టీరియా ద్వారా ఫుడ్‌ పాయిజన్ అవుతుంది. వండిన ఆహారాన్ని గది ఉష్ణోగ్రత దగ్గర ఎక్కువ సేపు ఉంచితే బాసిల్లస్‌ సెరియస్‌ అనే బాక్టీరియా చేసి ఆహారాన్ని పాయిజన్‌గా మార్చేస్తుంది. మనం పాచిపోయిన ఆహారం అంటామే! అది ఇదే! ఇలాంటి ఫుడ్డును తింటే ప్రాణాల మీదకు రావచ్చు. జీర్ణాశయ వ్యాధులు సోకవచ్చు. వాంతులు, డయేరియా, జీర్ణాశయ వ్యాధులు రావచ్చు. ఈ సిండ్రోమ్‌ అటాక్‌ అయినప్పుడు వికారం, కడుపు నొప్పి వస్తాయి కానీ చనిపోవడం అన్నది మాత్రం చాలా అరుదుగా జరుగుతుంది. వండిన కూరగాయలు, మాంసం వంటి వాటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచకూడదు. అలా ఉంచితే ట్యాక్సిన్లు ఉత్పత్తి అవుతాయి. ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారాన్ని పదే పదే వేడి చేయడ వల్ల అందులో విషతుల్య రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఇలాంటి సందర్భాలలో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. ఉదయం మిగిలిన ఆహారాన్ని రాత్రి పూట వేడి చేసిన తినడం, అలాగే రాత్రి మిగిలిన భోజనాన్ని ఫ్రిజ్‌లో ఉంచి ఉదయం వేడి చేసి తినడం.. ఈ రెండూ మంచిది కాదు. అలాగే గుడ్లను కూడా వండిన వెంటనే తినేయాలి. అది ఆమ్లెట్‌ అయినా, ఉడకపెట్టింది అయినా ఫ్రిజ్‌లో పెట్టి వేడి చేసి తినకూడదు. అలాగే పాస్తా, ఫ్రైడ్‌ రైస్‌ తో పాటు వండిన వంటలను మళ్లీ వేడి తినకూడదు. వాటిని వేడి చేసిననప్పుడు క్యాన్సర్‌ కారకాలు విడుదలవుతాయి. మొత్తంగా చెప్పేదేమిటంటే ఎప్పటికప్పుడు వండుకొని తినడమంత ఉత్తమమైన మార్గం మరోటి లేదు.

Updated On 8 Nov 2023 5:19 AM GMT
Ehatv

Ehatv

Next Story