ప్రముఖ బాలీవుడ్ నటి పూనమ్ పాండే(Poonam pandey) గర్భాశయ క్యాన్సర్‌తో(Cervical cancer) మరణించింది. పూనమ్ ఉత్తరప్రదేశ్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు ఓ జాతీయ మీడియా జర్నలిస్ట్ తెలిపారు. పూనమ్ మరణ వార్తను ఆమె పీఆర్ బృందం ధృవీకరించిందని, త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేస్తారని చెప్పారు. గత కొన్ని సంవత్సారాలుగా ఆమె సర్వైకల్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని.. ఈ కారణంతోనే ఆమె మరణించినట్లు తెలుస్తోంది.
ప్రముఖ బాలీవుడ్ నటి పూనమ్ పాండే(Poonam pandey) గర్భాశయ క్యాన్సర్‌తో(Cervical cancer) మరణించింది. పూనమ్ ఉత్తరప్రదేశ్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు ఓ జాతీయ మీడియా జర్నలిస్ట్ తెలిపారు. పూనమ్ మరణ వార్తను ఆమె పీఆర్ బృందం ధృవీకరించిందని, త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేస్తారని చెప్పారు. గత కొన్ని సంవత్సారాలుగా ఆమె సర్వైకల్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని.. ఈ కారణంతోనే ఆమె మరణించినట్లు తెలుస్తోంది.
2020లో ప్రపంచవ్యాప్తంగా 6,04,000 మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, దాదాపు 342,000 మంది ఈ వ్యాధితో మరణించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం స్త్రీ గర్భాశయంలో అసాధారణ పెరుగుదల కణాలు(Cell Growth), యోని నుంచి గర్భాశయంలోకి ప్రవేశించడం వల్ల మహిళల్లో ఈ క్యాన్సర్ సంక్రమిస్తుందని తెలిపింది. దీనిని ముందుగా గుర్తించినట్లయితే, గర్భాశయ క్యాన్సర్‌ను నియంత్రించొచ్చని చెప్తున్నారు.
ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala sitaraman) 2024 మధ్యంతర బడ్జెట్‌ను సమర్పిస్తూ తన ప్రసంగంలో దేశంలోని 9-14 ఏళ్ల వయసున్న బాలికలకు వ్యాక్సిన్(Vaccine) వేసేందుకు ప్రయత్నిస్తున్నామని, దీని ద్వారా గర్భాశ క్యాన్సర్ అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమె వివరించారు.
గర్భాశయ క్యాన్సర్‌కు హ్యూమన్ పాపిల్లోమావైరస్ HPV 99 శాతం కారణం. ఇది గొంతు, జననేంద్రియాలు, చర్మాన్ని ప్రభావితం చేసే సాధారణ లైంగిక సంక్రమణం. లైంగికంగా చురుకుగా ఉన్న వ్యక్తులు వారి జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ వైరస్ బారిన పడతారు. అయితే చాలా సందర్భాల్లో రోగనిరోధక వ్యవస్థ ద్వారా వైరస్ శరీరం నుంచి వెళ్లిపోతుంది. కానీ రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న మహిళల్లో కణాల మోతాదు పెరిగి ఇది క్యాన్సర్‌కు దారుతీస్తుందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అసాధారణ కణాలు క్యాన్సర్‌గా మారడానికి 15-20 సంవత్సరాలు పడుతుంది, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన మహిళల్లో ఈ ప్రక్రియ 5-10 సంవత్సరాలు మాత్రమే పడుతుంది. యువ తల్లులు, హార్మోన్ల గర్భనిరోధక వినియోగదారులు, ధూమపానం చేసేవారు, లైంగికంగా సంక్రమించే ఇతర అంటువ్యాధులతో గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశముందని తేలింది.
యోనిని(Vagina) ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. పీరియడ్స్(Periods) తర్వాత యోనిని శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. అందుకు సబ్బు కూడా వాడొద్దంటున్నారు. అక్కడ శుభ్రత లేకపోవడం గర్భాశయ క్యాన్సర్‌కు ముఖ్య కారణమని వైద్యులు తెలుపుతున్నారు. కెమికల్ ప్యాడ్స్ వాడడం కూడా కారణమని వైద్యులు చెప్తున్నారు. అయితే యోని శుభ్రత కోసం మార్కెట్‌లో పలు హైజెనిక్ లిక్విడ్స్ లభిస్తాయిని అవసరమైతే వైద్యుల సూచన ప్రకారం ఇవి వాడాలని సూచిస్తున్నారు.
లక్షణాలు-చికిత్స
పీరియడ్స్ మధ్య, మెనోపాజ్ తర్వాత, లైంగిక సంపర్కం తర్వాత అసాధారణ రక్తస్రావం వస్తే వెంటనే చికిత్స ప్రారంభించాలి. దుర్వాసనతో కూడిన వజీనల్ డిశ్చార్జ్(Vaginal discharge), వెన్ను, కాళ్లు, పొత్తికడుపులో నొప్పి, బరువు తగ్గడం, అలసట, ఆకలి లేకపోవడం, యోని దగ్గర సౌకర్యంగా లేకపోవడం, కాళ్లలో వాపు ఈ వ్యాధి లక్షణాలు. ఇలాంటి లక్షణాలు కనపడితే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.