మారుతున్న జీవణ శైలిలో.. ఒత్తిడి జీవితం మనిషిని చాలా చిన్నవయస్సులోనే రోగాలబారిన పడేస్తుంది. అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యం చాలా త్వరగా పాడైపోతుంది. గతంలో జీవన విధానం కారణంగానే 80 ఏళ్లు దాటినా.. షుగర్, బీపీలు లాంటివి వచ్చేవి కాదు.. కాని ఇప్పుడు మూడు పదుల వయస్సు దాటితేనే అనేక రుగ్మతలు శరీరాన్ని ఇబ్బందిపెడుతున్నాయి.
మారుతున్న జీవణ శైలిలో.. ఒత్తిడి జీవితం మనిషిని చాలా చిన్నవయస్సులోనే రోగాలబారిన పడేస్తుంది. అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యం చాలా త్వరగా పాడైపోతుంది. గతంలో జీవన విధానం కారణంగానే 80 ఏళ్లు దాటినా.. షుగర్, బీపీలు లాంటివి వచ్చేవి కాదు.. కాని ఇప్పుడు మూడు పదుల వయస్సు దాటితేనే అనేక రుగ్మతలు శరీరాన్ని ఇబ్బందిపెడుతున్నాయి. ఇప్పుడు చెప్పబోయే లక్షణాలు కనిపిస్తే.. మీకు షుగర్ వచ్చినట్టే.. ఒక్క సారి గమనించుకోండి..
మధుమేహం అనేది ఈ రోజుల్లో చాలా కామన్ గా మారిపోయింది. వయసు సంబంధం లేకుండా చాలా మంది ఈ మధుమేహం సమస్య బారినపడుతున్నారు. ఎక్కువ మందికి తమకు షుగర్ వచ్చిందనే విషయం చాలా ఆలస్యంగా తెలుసుకుంటూ ఉంటారట. కానీ.. దీని లక్షణాలు మనకు 30ఏళ్లు దాటిన తర్వాతి నుంచే మొదలౌతాయట. కొన్నిసింపుల్ లక్షణాలతో షుగర్ ని కనిపెట్టేయవచ్చట. ఆ లక్షణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
30 ఏళ్ల తర్వాత చూపు అస్పష్టంగా లేదా హెచ్చుతగ్గులకు లోనవడం మధుమేహానికి సంకేతంగా పరిగణిస్తారు. అధిక చక్కెర స్థాయి కంటి నొప్పికి కారణమవుతుంది. సమతుల్యతను ప్రభావితం చేస్తుంది. ఇది కంటి లెన్స్ ఆకృతిలో తాత్కాలిక మార్పుకు కారణమవుతుంది.
ఒక వ్యక్తికి దురద , పొడి చర్మం వంటి నిరంతర సమస్యలు ఉంటే, అది అధిక రక్త చక్కెర లక్షణంగా పరిగణిస్తారు. డయాబెటిస్ చర్మంలో తేమను తగ్గిస్తుంది. దాని వల్లే.. పొడి చర్మం సమస్య ఏర్పడుతుంది.
బరువు పెరగడం సాధారణ లక్షణమే అయినప్పటికీ, మధుమేహంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సాధారణంగా ఇది కడుపు చుట్టూ ఇన్సులిన్ నిరోధకత కారణంగా ఉంటుంది. ఆహారం, వ్యాయామంలో ఎలాంటి మార్పులు లేకుండానే వేగంగా బరువు పెరిగిపోతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
కొందరికి తిన్న తర్వాత చాలా దాహం వేస్తుంది. ఇది మధుమేహం లక్షణంగా పరిగణించవచ్చు. దీనిని పాలీడిప్సియా అని కూడా అంటారు. ఇది మూత్రవిసర్జన ద్వారా అదనపు చక్కెరను విసర్జించే శరీర సామర్థ్యానికి సంబంధించినదని నమ్ముతారు. ఎవరైనా అసాధారణ దాహం .. అంటే ఎప్పుడూ ఉన్న దాహం కంటే కాస్త ఎక్కువ దాహం అనిపిస్తే.. జాగ్రత్తపడటం మంచిది.
చర్మంపై డార్క్ స్పాట్స్ అనేది డయాబెటిక్ పరిస్థితి, దీనిని అకాంథోసిస్ నైగ్రికన్స్ అని కూడా అంటారు. ఇది ఇన్సులిన్ నిరోధకత , టైప్ 2 మధుమేహం సంకేతం కూడా కావచ్చు. ఇలా రకరకాల కారణాల వల్ల డయాబెటిస్ అటాక్ అవుతుంది. సో బీ కేర్ ఫుల్.