చిన్న పిల్లలు తరుచుగా తమ వేళ్లను(Fingers) నోట్లో పెట్టుకుంటారు. ఈ అలవాటు మాన్పించాలని ఎంత ట్రై చేసినా వాళ్లు నోట్లో వేళ్లు వేసుకునే ఉంటారు. కానీ ఒక్కరు వేసుకుంటే అది ఆ పిల్లల అలవాటు అనుకోవచ్చు.. కానీ చిన్నపిల్లలు అంతా ఎందుకు వేసుకుంటారు. ఇది అలావాటేనా ఇంకేదైనా కారణాలున్నాయనేది చూద్దాం. పిల్లలు బాగా అలసిపోయినప్పుడు, నిద్రపోలేనప్పుడు తమ సౌలభ్యం కోసం నోట్లో వేళ్లు పెట్టుకుంటారు.

చిన్న పిల్లలు తరుచుగా తమ వేళ్లను(Fingers) నోట్లో పెట్టుకుంటారు. ఈ అలవాటు మాన్పించాలని ఎంత ట్రై చేసినా వాళ్లు నోట్లో వేళ్లు వేసుకునే ఉంటారు. కానీ ఒక్కరు వేసుకుంటే అది ఆ పిల్లల అలవాటు అనుకోవచ్చు.. కానీ చిన్నపిల్లలు అంతా ఎందుకు వేసుకుంటారు. ఇది అలావాటేనా ఇంకేదైనా కారణాలున్నాయనేది చూద్దాం. పిల్లలు బాగా అలసిపోయినప్పుడు, నిద్రపోలేనప్పుడు తమ సౌలభ్యం కోసం నోట్లో వేళ్లు పెట్టుకుంటారు. ఇది వారికి సురక్షితంగా(Safe), సుఖంగా(secure) ఉంటుంది. దంతాలు వస్తుండడంతో చిగుళ్లలో దురద రావడంతో నొప్పి నుంచి రిలాక్సయ్యేందుకు నోట్లో వేళ్లు పెట్టుకుంటారు. అంతేకాకుండా పిల్లలు తమ చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలను తదేకంగా చూస్తున్న సమయంలో నోట్లో వేలు పెట్టుకొని గమనిస్తుంటారు. ఆకలిగా ఉన్నప్పుడు కూడా నోట్లో వేలుపెట్టుకొని తమ భావాలను వ్యక్త పరుస్తారు. ఈ కారణాలన్నీ సర్వసాధారణమని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇది వారి అభివృద్ధిలో భాగమని, పిల్లలు పెరుగుతున్న కొద్దీ ఈ అలవాటును నెమ్మదిగా వదులుకుంటారు. కానీ మరీ ఎక్కువగా నోట్లో వేళ్లు పెట్టుకోవడం వల్ల పళ్లు ఎత్తుగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ అలవాటును చూసిచూడనట్లు వదిలేయకండి. వీలైనంత త్వరగా మన్పించేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు.

Updated On 13 April 2024 7:56 AM GMT
Ehatv

Ehatv

Next Story