మన దగ్గరైతే పిల్లలకు మన ఇష్టమొచ్చిన పేర్లు పెట్టుకోవచ్చు. పింగళి నాగేంద్రరావులా కొత్త కొత్త పేర్లు కనిపెట్టి మరీ పెట్టుకోవచ్చు. ఎవడూ అడగడు. అసలు బేబీ కడుపులో ఉన్నప్పటి నుంచే ఏం పేరు పెట్టాలా? అని కుటుంబసభ్యులంతా తర్జనభర్జనలు పడుతుంటారు. జన్మ నక్షత్రాన్ని(Birth star) బట్టి కొందరు పేర్లు(Names) పెట్టుకుంటే కొందరేమో పితృదేవతల పేర్లు పెట్టుకుంటారు. ఇప్పుడీ నామాల గోల ఎందుకంటారా?

మన దగ్గరైతే పిల్లలకు మన ఇష్టమొచ్చిన పేర్లు పెట్టుకోవచ్చు. పింగళి నాగేంద్రరావులా కొత్త కొత్త పేర్లు కనిపెట్టి మరీ పెట్టుకోవచ్చు. ఎవడూ అడగడు. అసలు బేబీ కడుపులో ఉన్నప్పటి నుంచే ఏం పేరు పెట్టాలా? అని కుటుంబసభ్యులంతా తర్జనభర్జనలు పడుతుంటారు. జన్మ నక్షత్రాన్ని(Birth star) బట్టి కొందరు పేర్లు(Names) పెట్టుకుంటే కొందరేమో పితృదేవతల పేర్లు పెట్టుకుంటారు. ఇప్పుడీ నామాల గోల ఎందుకంటారా? అక్కడికే వస్తున్నా! ముందు చెప్పినట్టు మన దేశంలో మనకు తోచినపేరు పెట్టుకోవచ్చు కానీ కొన్ని దేశాల్లో కొన్ని పేర్లు అస్సలు పెట్టుకోకూడదు. పొరపాటున నిషేధించిన ఆ పేర్లను పెట్టుకున్నారే అనుకోండి! ఎంచక్కా శ్రీకృష్ణజన్మస్థానానికి వెళ్లవచ్చు! బ్రిటన్‌లో(Britain) పేరు పక్కన ఇంటిపేరు ఉంచుకోవడంపై ఎలాంటి నిషేధం లేదు కానీ రిజిస్ట్రార్లు ఎలాంటి పేర్లను అంగీకరిస్తారనేది గమనించాలి. పేరులో అభ్యంతరకర అక్షరాలు(Forbidden Letter) ఉండకూడదు. నంబర్లు లేదా చిహ్నాలు వాడినప్పుడు వాటిని సరిగా వినియోగిస్తున్నట్టు స్పష్టం చేయాలి. పేరు మరీ పొడవుగా ఉండకూడదు. అంటే రిజిస్ట్రేషన్ పేజీలో ఇచ్చిన కాలమ్‌లో సరిపోయినంత వరకే ఉండాలన్నమాట! పేరు పెద్దగా ఉంటే రిజిస్ట్రేషన్‌ చేయడం కుదరదు కదా! అమెరికాలో(America) కూడా కొన్ని పేర్లపై నిషేధం ఉంది. పిల్లలకు కింగ్, క్వీన్‌, జీసస్‌ క్రైస్ట్‌, III, శాంతాక్లాజ్‌, మెజెస్టీ, అడాల్ఫ్‌ హిట్లర్‌, మెస్సీయా, @, 1069 లాంటి పేర్లు పెట్టకూడదు. ఇక ఏఏ దేశాలు, ఏఏ పేర్లను నిషేధించాయో చూద్దాం.. సెక్స్ ఫ్రూట్ (Newzealand), లిండా (Saudi Arabia), స్నేక్‌ (Malesiya), ఫ్రైడే (ఇటలీ), ఇస్లాం (China), సారా (Morocco), చీఫ్ మాక్సిమస్ (న్యూజిలాండ్), రోబోకాప్ (Mexico), డెవిల్ (జపాన్), నీలం (ఇటలీ), సున్తీ (మెక్సికో), ఖురాన్ (చైనా), హ్యారియెట్ (ఐస్లాండ్), మంకీ (డెన్మార్క్), థోర్ (పోర్చుగల్), 007 (మలేషియా), గ్రిజ్‌మన్ ఎంబాప్పే (ఫ్రాన్స్), తాలులా హవాయి (న్యూజిలాండ్), బ్రిడ్జ్‌(నార్వే), ఒసామా బిన్ లాడెన్ (జర్మనీ), మెటాలికా (స్వీడన్), ప్రిన్స్ విలియం (ఫ్రాన్స్), అనల్ (న్యూజిలాండ్), నుటెల్లా (ఫ్రాన్స్), వోల్ఫ్ (స్పెయిన్), టామ్-టామ్ (పోర్చుగల్), కెమిల్లా (ఐస్లాండ్), జుడాస్ (స్విట్జర్లాండ్), డ్యూక్ (ఆస్ట్రేలియా).

Updated On 6 Feb 2024 12:34 AM GMT
Ehatv

Ehatv

Next Story