ఈరోజుల్లో నిద్రపోయేందుకు(Sleep) మెత్తని పరుపులను ఎంచుకుంటున్నారు. ఎంత ఖరీదైన పరుపులో పడుకుంటే అంత స్టేటస్ సింబల్‌గా చూస్తున్నారు. అయితే పరుపులపై పడుకునేదానికంటే నేలపై పడుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. బెడ్స్‌పై నిద్రపోయేవారికి కొన్ని సమస్యలొస్తాయి. అదే సమయంలో నేలపై పడుకుంటే కొన్ని సమస్యలు తగ్గుతాయి. ఈ కారణంగా నేలపై పడుకోవాలని(Sleeping On Floor) నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయని కూడా చెబుతున్నారు.

నేలపై పడుకుంటే వెన్నెముకని(Back Bone) సరిగ్గా ఉంచడంలో సాయపడుతుంది దీంతో వెన్నునొప్పిని(Back pain) తగ్గించడానికి ఉపయోగపడుతుంది. నేలపై పడుకోవడం వల్ల హాయిగా నిద్రపోతారని చెప్తున్నారు. పరుపులు, దిండ్ల ఒత్తిడి లేకపోవడంతో మంచి రక్త ప్రసరణ(Blood Flow) ఉంటుంది. దీంతో చక్కగా నిద్రపడుతుంది. కంటినిండా నిద్రపోతారని.. నిద్రలో సహజ శరీర కదలిక ఉంటుందని అంటున్నారు. నేలపై పడుకోవడం వల్ల శరీర బరువు సమాంతరంగా ఉంటుంది. ఇబ్బంది తగ్గిపోయి అసౌకర్యం దూరమవుతుంది. ఒత్తిడి తగ్గడంతో నేలపై పడుకుంటే శరీర ఉష్ణోగ్రత(Body temperature) కంట్రోల్ అవుతుంది. కుషన్‌లాంటి వాటివి లేకపోవడంతో వేడి జనరేట్ కాదు. అయితే నేలపై పడుకోవడంతో దుమ్ము, పురుగుల వంటివి అలర్జీలకి కారణమై నిద్రను తగ్గిస్తాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు నేలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. దీని వల్ల అలర్జీలు తగ్గుతాయి. అంతేకాకుండా గర్భిణీలు, వెన్నునొప్పి వంటి సమస్యలు ఉన్నవారు నేలపై పడుకోవాలనుకుంటే డాక్టర్‌ను సంప్రదించాకే ముందుకెళ్లాలంటున్నారు.