మాతృత్వం కావాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. మాతృత్వాన్ని ఆస్వాదించాలని, తన పిల్లలకు ప్రేమానురాగాలను పంచాలని ప్రతీ మహిళ ఆకాంక్షిస్తుంది. అయితే కొందరికి పిల్లలు(children) పుట్టడం ఆలస్యమవుతుంది. వైద్య నిపుణు(Doctors)లు చెప్తున్నారు. రకరకాల కారణాల వల్ల కొందరు మహిళలకు గర్భంరాదు(Pregnancy). 30 ఏళ్లలోపు ఉన్న మహిళలకు గర్భం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని వైద్యశాస్త్రం చెప్తోంది. కొందరు మహిళలకు ఏళ్లుగా వేచిచూసినా గర్భం రాకపోవడంతో ఆస్పత్రులను సంప్రదిస్తుంటారు. వైద్య పరీక్షల అనంతరం తగిన చికిత్స(Treatment) అందిస్తుంటారు డాక్టర్లు. అయితే 40 ఏళ్లు దాటిన మహిళలు గర్భం దాలిస్తే చాలా సవాళ్లు, సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వైద్యరంగ నిపుణులు చెప్తున్నారు.

మాతృత్వం(Motherhood) కావాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. మాతృత్వాన్ని ఆస్వాదించాలని, తన పిల్లలకు ప్రేమానురాగాలను పంచాలని ప్రతీ మహిళ ఆకాంక్షిస్తుంది. అయితే కొందరికి పిల్లలు(children) పుట్టడం ఆలస్యమవుతుంది. వైద్య నిపుణు(Doctors)లు చెప్తున్నారు. రకరకాల కారణాల వల్ల కొందరు మహిళలకు గర్భంరాదు(Pregnancy). 30 ఏళ్లలోపు ఉన్న మహిళలకు గర్భం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని వైద్యశాస్త్రం చెప్తోంది. కొందరు మహిళలకు ఏళ్లుగా వేచిచూసినా గర్భం రాకపోవడంతో ఆస్పత్రులను సంప్రదిస్తుంటారు. వైద్య పరీక్షల అనంతరం తగిన చికిత్స(Treatment) అందిస్తుంటారు డాక్టర్లు. అయితే 40 ఏళ్లు దాటిన మహిళలు గర్భం దాలిస్తే చాలా సవాళ్లు, సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వైద్యరంగ నిపుణులు చెప్తున్నారు.

మహిళలకు వయస్సు పెరుగుతున్నకొద్దీ గర్భం దాల్చడం మరింత సవాల్‌గా మారుతుందని వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా 35 ఏళ్లు దాటిన తర్వాత అయితే స్త్రీలలో అండాల(Eggs) పరిణామం, నాణ్యత తగ్గడంతో గర్భం ధరించడం చాలా కష్టమవుతుందని అంటున్నారు. 40 ఏళ్లు దాటిన మహిళలు గర్భం దాల్చే అవకాశం గణనీయంగా తగ్గుతుందంటున్నారు. 40 ఏళ్లు దాటిన మహిళల్లో చాలా మందికి ఐవీఎఫ్‌(IVF) లేదా ఇతర మార్గాల ద్వారానే గర్భం దాల్చడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఐవీఎఫ్‌ కూడా చాలా ఖర్చుతో ముడిపడి ఉన్న అంశమని వైద్యులు అంటున్నారు. అయితే వారు తరుచుగా డాక్టర్లను సంపద్రించాల్సి వస్తుందన్నారు. 40 ఏళ్లు దాటిన మహిళలకు బీపీ(BP), షుగర్‌(Sugar) ఉండే అవకాశం ఉందని వీటి వల్ల ఇద్దరికీ ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వయస్సు పెరిగేకొద్దీ గర్భస్రావం(Miscarriage) సమస్య కూడ వచ్చే అవకాశం ఉందన్నారు. గర్భంలో పెరుగుతున్న పిండంలో(fetus) క్రోమోజోమ్‌ల(Chromosomes) లోపం ఏర్పడితే గర్భస్రావం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. 40 ఏళ్లు దాటిన మహిళలకు గర్భధారణ సమస్యంలో మధుమేహం(Diabetes) వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని.. ఇది తల్లీబిడ్డకు ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. అధిక రక్తపోటు వల్ల గర్భాశయానికి రక్త సరఫరా సక్రమంగా ఉండదని అంటున్నారు. అంతేకాదు 40 ఏళ్లు దాటిన మహిళలకు ప్రీటర్మ్‌ బర్త్‌ (గడువుకు ముందే జననం) వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. ఐవీఎఫ్‌ చికిత్స చేయించుకుంటే ట్విన్స్‌కు ఎక్కువ చాన్స్‌ ఉందని.. 40 దాటిన మహిళల గర్భాశయానికి ట్విన్స్‌ను క్యారీ చేసే సామర్థ్యం ఉండదంటున్నారు వైద్యలు. అయితే కొందరు మహిళలు 40 దాటిన తర్వాత కూడా ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తారని.. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయని వైద్యులు వెల్లడించారు.

Updated On 1 Dec 2023 7:31 AM GMT
Ehatv

Ehatv

Next Story