థియేటర్లు(Theater), ఆసుపత్రులు(Hospitals) మరియు షాపింగ్ మాల్స్‌లోని టాయిలెట్లు(Toilets) సాధారణ టాయిలెట్ల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. అయితే దీని వెనుక కారణం ఏంటో తెలుసా? షాపింగ్ మాల్స్, థియేటర్లలోని టాయిలెట్ల తలుపులకు కింద నుంచి కొంత గ్యాప్‌ ఉంటుంది.

థియేటర్లు(Theater), ఆసుపత్రులు(Hospitals) మరియు షాపింగ్ మాల్స్‌లోని టాయిలెట్లు(Toilets) సాధారణ టాయిలెట్ల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. అయితే దీని వెనుక కారణం ఏంటో తెలుసా? షాపింగ్ మాల్స్, థియేటర్లలోని టాయిలెట్ల తలుపులకు కింద నుంచి కొంత గ్యాప్‌ ఉంటుంది. కానీ ఒక్కోసారి మన దృష్టి వాటివైపు వెళ్లదు. పెట్టారా? ఈ ప్రదేశాలలో మరుగుదొడ్లు సాధారణ మరుగుదొడ్లకు భిన్నంగా ఉన్నాయని చూసే ఉంటారు. అయితే వీటిని ఎందుకు అలా పెడతారో చూద్దాం.

టాయిలెట్‌కు వెళ్లినవారు అకస్మాత్తుగా అనారోగ్యంపాలైతే వెంటనే గుర్తించి వారిని బయటకు తీసుకొచ్చే అవకాశం(Rescue Purpose) ఉంటుందని ఈ గ్యాప్‌ వదులుతారు. మరో కారణమంటే ఇలాంటి టాయిలెట్‌లను శుభ్రం చేయడం సులభం అవుతుంది. అక్కడ నుంచి నీటిని సులభంగా తొలగించవచ్చు. దీనితో పాటు, అక్కడ ఉన్న చెడు వాసన కూడా దిగువ గ్యాప్ నుంచి బయటకు వెళ్లిపోతుంది. వీటి తలుపులు సాధారణంగా పొడవుగా ఉంటాయి. దీని కారణంగా వెంటిలేషన్, లైట్ కోసం సరైనంత స్థలం ఉంది. ఎవరైనా ధూమపానం చేస్తుంటే వారిని సులభంగా గుర్తించవచ్చు. ఎవరైనా బయటి నుండి లాక్ చేస్తే తలుపులను సులభంగా పగలగొట్టే అవకాశం ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగినా తలుపులు తీయడం సులభం. అంతేకాకుండా దిగువ నుంచి తలుపులు తెరిచేందుకు వీలుగా వీటిని బిగిస్తారు. అలాగే, వీటిని వైపర్‌తో సులభంగా శుభ్రం చేయవచ్చు. ఈ కారణాలచేత థియేటర్లు, షాపింగ్‌మాల్స్ ఇతర ప్రాంతాల్లో ఇలా కింది నుంచి గ్యాప్‌ ఉండేలా టాయిలెట్‌ తలుపులు బిగిస్తారు.

Updated On 28 Jan 2024 2:55 AM GMT
Ehatv

Ehatv

Next Story