అన్ని కీటకాలలో దోమలు(Mosquitoes) అత్యంత ప్రమాదకరమైనవి. ఎందుకంటే దోమల వల్ల వచ్చే జ్వరాలు(fever) ప్రాణాంతకం కావచ్చు. ముఖ్యంగా డెంగ్యూ(Dengue), మలేరియా వంటి ప్రాణాంతక జ్వరాలు దోమల ద్వారా వ్యాపిస్తాయి.
అన్ని కీటకాలలో దోమలు(Mosquitoes) అత్యంత ప్రమాదకరమైనవి. ఎందుకంటే దోమల వల్ల వచ్చే జ్వరాలు(fever) ప్రాణాంతకం కావచ్చు. ముఖ్యంగా డెంగ్యూ(Dengue), మలేరియా వంటి ప్రాణాంతక జ్వరాలు దోమల ద్వారా వ్యాపిస్తాయి.
ఇప్పుడు నగరాల్లో పర్యావరణం చాలా అధ్వాన్నంగా ఉంది, కొన్ని చోట్ల నీరు నిలిచి, దోమలు సులభంగా వృద్ధి చెందుతాయి. కాబట్టి చాలా మంది ఇంట్లో దోమల నివారణ మందులను ఉపయోగిస్తారు.
కాని ఇలా రసాయనాలతో తయారు చేసిన మందులు వాడటం వల్ల కొందరిలో ఎలర్జీ(Allergy) కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి వారు ఇంట్లోనే దోమల నివారణ మొక్కలను(Plants) పెంచుకోవచ్చు. ఆ మొక్కల సువాసన వల్ల ఇల్లు ప్రెష్ గా ఉండటంతో పాటు.. ఈ వాసనకు దొమలు కూడా పారిపోతాయి.
దోమలను తరిమికొట్టడానికి ఉపయోగించే అనేక మొక్కలను అలంకరణ కోసం కూడా ఉపయోగిస్తారు. సహజంగా ఇల్లు మరియు కుటుంబాన్ని రక్షించడానికి,దోమల నివారణ మొక్కలలో కొన్నింటిని పెంచండి మంచి ప్రయోజనం పొందండి.
బంతి పువ్వుల(marigold flower) సువాసన ఇంట్లోని దోమలను తరిమికొడుతుంది. ఈ మొక్కకు సూర్యరశ్మి చాలా అవసరం. కాబట్టి దీనిని కుండీలో, ఉదయం తోటలో మరియు సాయంత్రం ఇంటి లోపల పెంచవచ్చు.
సిట్రోనెల్లా(Citronella) ఇది ఒక రకమైన గడ్డి. దీని ప్రత్యేకత ఏమిటంటే.. నిమ్మ వాసన కలిగి ఉంటుంది. పొడవాటి కొమ్మలతో ఉండే ఈ మొక్క వాసనకు దోమలు దగ్గరకి రావు.
తులసి ప్రతి ఒక్కరి ఇంట్లో పెరిగే మొక్క. ఈ సువాసనగల మూలికను ఇంట్లో పెంచుకోవడం వల్ల దోమలను తరిమికొట్టవచ్చు.
గుర్రపు పుదీనా ఇది ఒక రకమైన పుదీనా మొక్క. మీరు ఈ మొక్కను ఇంటి లోపల పెంచుకుంటే, దాని సువాసన దోమలను తరిమికొడుతుంది.