కొత్త బట్టలు(New Clothes) ధరించడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్నపిల్లలకే కాదు.. పెద్దవారు కూడా కొత్తగా దుస్తులను తీసుకోగానే మరుసటి రోజు ధరిస్తారు. నిజమే అవి మన మనసుకు పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయి. కానీ మీకు తెలుసా ?.. కొత్త బట్టలు అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి. చాలా మంది కొత్త బట్టలు ఇంటికి తెచ్చిన వెంటనే వాటిని ధరించడం అలవాటు ఉంటుంది. కానీ ఆ పొరపాటు ఆరోగ్యానికి నష్టాన్ని కలిగిస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం కొత్త దుస్తులను ధరించడం వల్ల ఇన్ఫెక్షన్స్, వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. చాలా మంది ఆన్‌లైన్‌లో(Online) దుస్తులను ఆర్డర్ చేస్తారు. కానీ ఫిట్టింగ్ సరిగ్గా లేకుంటే తిరిగి పంపిస్తారు.

కొత్త బట్టలు(New Clothes) ధరించడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్నపిల్లలకే కాదు.. పెద్దవారు కూడా కొత్తగా దుస్తులను తీసుకోగానే మరుసటి రోజు ధరిస్తారు. నిజమే అవి మన మనసుకు పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయి. కానీ మీకు తెలుసా ?.. కొత్త బట్టలు అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి. చాలా మంది కొత్త బట్టలు ఇంటికి తెచ్చిన వెంటనే వాటిని ధరించడం అలవాటు ఉంటుంది. కానీ ఆ పొరపాటు ఆరోగ్యానికి నష్టాన్ని కలిగిస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం కొత్త దుస్తులను ధరించడం వల్ల ఇన్ఫెక్షన్స్, వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. చాలా మంది ఆన్‌లైన్‌లో(Online) దుస్తులను ఆర్డర్ చేస్తారు. కానీ ఫిట్టింగ్ సరిగ్గా లేకుంటే తిరిగి పంపిస్తారు. ఇక అలాగే చాలా మంది ట్రయల్ రూంలో(trail room) బట్టలు వేసుకుని ఇష్టం లేకుంటే అక్కడే వదిలేస్తారు. అలా వదిలేసిన బట్టలను మరొకరు తీసుకుంటారు. దీంతో అలా దుస్తులు ధరించడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు(Skin Problems) తలెత్తుతాయి. ఈ వైరస్‌లు ఒకరిపై మరొకరికి ప్రభావం చూపిస్తాయని అంటున్నారు నిపుణులు.

షోరూమ్ బట్టలు(Show room Clothes)..
షోరూమ్‌లోని ట్రయల్ రూమ్ లో బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. ఎవరైనా మాల్ లేదా షోరూమ్‌లో బట్టలు కొనడానికి వెళితే ముందుగా ట్రయల్ రూమ్‌కి వెళ్లి ఫిట్టింగ్‌ని చెక్ చేస్తారు. బట్టలు సెట్ కాకపోత వాటిని అక్కడే వదిలేస్తారు. ఇక ఆ వ్యక్తి చెమట లేదా మురికి ఆ బట్టలకు అంటుకుంటుంది. వాటిని అలాగే మడతపెట్టి ర్యాక్ లో పెట్టేస్తారు. వాటిని మరొకరు తీసుకుంటారు. అలా ఒకరి చర్మ సమస్యలు మరొకరికి అంటుకుంటాయి.

ఆన్‌లైన్‌లో బట్టలు ఆర్డర్(Online Order Clothes) చేయడం
ఇప్పుడు చాలా మంది ఆన్‌లైన్‌లో బట్టలు ఆర్డర్ చేయడం అలవాటుగా మారింది. ఇక అవి వచ్చిన తర్వాత సరిగ్గా సెట్ కాకపోతే వాటిని రిటర్న్ పెట్టేస్తారు. దీంతో ఆ వ్యక్తి చెమట లేదా మురికి వాటిలో కలిసిపోతుంది. మరొక వ్యక్తి అదే వస్త్రాన్ని తీసుకున్నప్పుడు, ఆ చెమట అతని చర్మంపై ప్రభావం చూపుతుంది. ఇవి కంటికి కనిపించని వైరస్‌లు లేదా బ్యాక్టీరియా. అందుకే ఉతికిన తర్వాత మాత్రమే కొత్త బట్టలు ధరించడం మంచిది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం చాలా కంపెనీలు దుస్తులపై మరకలను తొలగించడానికి, రంగులు వేయడానికి, మృదువుగా, బట్టల ముడతలను తొలగించడానికి వివిధ రకాల రసాయనాలను ఉపయోగిస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా హానికరం. కంపెనీలు ఈ రసాయనం గురించి పెద్దగా సమాచారం ఇవ్వనప్పటికీ. ఫార్మాల్డిహైడ్ వంటి రసాయనాలను ప్రామాణికం కంటే ఎక్కువగా కలిపే కంపెనీలు చాలా ఉన్నాయి. అందుకే కొత్త బట్టలను ఉతికిన తర్వాత ధరించడమే మంచిది.

Updated On 11 Jun 2023 12:05 AM GMT
Ehatv

Ehatv

Next Story