మాదక ద్రవ్యాలు(Durgs) తీసుకున్నప్పుడు మెదడులో ప్రేరేపితమయ్యే భాగాలే శృంగార వీడియోలు చూసినప్పుడు ప్రేరేపితమవుతాయట! తద్వారా శృంగార పటుత్వం పెరుగుతుందని, ఈ కారణంగా నిజ జీవితంలో శృంగారానికి, శృంగార వీడియోలకు పోలిక లేకపోవడం వల్ల దానిపై ఆసక్తి తగ్గుతుందని పరిశోధకులు అంటున్నారు. ఈ పరిశోధన ఇలా ఉంటే, చైనా(China) పరిశోధకులు ఇంకో బాంబులాంటి వార్త చెప్పారు.

మగపుంగవుల్లారా పోర్న్‌ వీడియోలు ఎక్కువగా చూస్తున్నారా? జాగ్రత్త... కంట్రోల్‌ చేసుకోండి.. వీలైతే చూడ్డం మానేయండి.. అలా చూస్తూనే పోతే సెక్స్‌పై(SEX) కోరికలు నశిస్తాయట! సంతృప్తి అనిపించదట! ఇలాగని ఓ అధ్యయనంలో తేలింది. మత్తు పదార్ధాలను వాడటం ఎలాంటిదో శృంగార వీడియోలను ఎక్కువగా చూడటం కూడా అలాంటిదేనని పరిశోధకులు అంటున్నారు.

మాదక ద్రవ్యాలు(Durgs) తీసుకున్నప్పుడు మెదడులో ప్రేరేపితమయ్యే భాగాలే శృంగార వీడియోలు చూసినప్పుడు ప్రేరేపితమవుతాయట! తద్వారా శృంగార పటుత్వం పెరుగుతుందని, ఈ కారణంగా నిజ జీవితంలో శృంగారానికి, శృంగార వీడియోలకు పోలిక లేకపోవడం వల్ల దానిపై ఆసక్తి తగ్గుతుందని పరిశోధకులు అంటున్నారు. ఈ పరిశోధన ఇలా ఉంటే, చైనా(China) పరిశోధకులు ఇంకో బాంబులాంటి వార్త చెప్పారు.

వారు చెప్పినదాన్ని బట్టి నిద్రకు(Sleep) వీర్య కణాల(Sperm cell) నాణ్యతకు సంబంధం ఉంది! ఎక్కువ సేపు నిద్రపోయినా, నిద్రకు తక్కువ సమయం కేటాయించినా ప్రమాదమేనని వారు అంటున్నారు. విస్తృత పరిశోధనల తర్వాత వారు ఈ నిర్ణయానికి వచ్చారు. పరిశోధన కోసం వారు కొంత మందిని ఎంపిక చేశారు. అందులో కొందరికి ఆరు గంటలు, అంత కంటే తక్కువ సమయం నిద్రపోవాలని సూచించారు. మరికొందరిని ఏడెనిమిది గంటల పాటు పడుకోమని చెప్పారు.

ఇంకొందరిని తొమ్మిది గంటలు అంతకంటే ఎక్కువసేపు నిద్రపోవాలని తెలిపారు. ఆరు గంటల కంటే తక్కువ సేపు పడుకున్నవారిలోనూ, తొమ్మిది గంటల కంటే ఎక్కువ సేపు నిద్రపోయిన వారిలోనూ వీర్యం నాణ్యత తగ్గిందట. ఏడెనిమిది గంటల పాటు నిద్రించిన వారిలో వీర్యం నాణ్యతతో ఉన్నట్టు పరివోధకులు గుర్తించారు. నిద్ర తక్కువైనా, ఎక్కువైనా వీర్యం నాణ్యతను దెబ్బతీసే యాంటీ స్పెర్మ్‌ యాంటీ బాడీ ప్రొటీన్లు విడుదల అవుతున్నట్టు పరిశోధనలో తేలింది. దీని వల్ల వీర్యం నాణ్యత దెబ్బతింటుందని పరిశోధకులు గుర్తించారు.

Updated On 29 May 2023 1:22 AM GMT
Ehatv

Ehatv

Next Story