ప్రశాంతమైన నిద్ర(sleep).. ఇప్పుడు చాలా మందికి దొరకడం లేదు. మారిన జీవనశైలి.. ఉద్యోగం.. మానసిక ఒత్తిడి(Mental Pressure).. ఆహారంలో మార్పులు ఇలా చాలా అంశాలు నిద్రకు భంగం కలిగిస్తాయి. అయితే చాలా మంది రాత్రిళ్లు తిన్న వెంటనే వాకింగ్ చేస్తుంటారు. మరికొందరు తినగానే నిద్రపోతుంటారు.

ప్రశాంతమైన నిద్ర(sleep).. ఇప్పుడు చాలా మందికి దొరకడం లేదు. మారిన జీవనశైలి.. ఉద్యోగం.. మానసిక ఒత్తిడి(Mental Pressure).. ఆహారంలో మార్పులు ఇలా చాలా అంశాలు నిద్రకు భంగం కలిగిస్తాయి. అయితే చాలా మంది రాత్రిళ్లు తిన్న వెంటనే వాకింగ్ చేస్తుంటారు. మరికొందరు తినగానే నిద్రపోతుంటారు. కానీ ఇలా చేయడం వలన బరువు పెరుగుతారు. అలాగే అర్ధరాత్రి వరకు స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం కూడా నిద్రకు భంగం కలిగిస్తుంది. అందుకే ప్రశాంతమైన నిద్రకు ముందుకు మీరు పాదాలు(Foot) శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన మంచి నిద్ర మాత్రమే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అందుకే రాత్రిపూట నిద్రపోయే ముందు పాదాలను కడిగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవెంటో తెలుసుకుందామా.
రాత్రి పాదాలు కడుక్కున్న తర్వాత నిద్రపోవడం వల్ల ఈ ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి

ఒక వ్యక్తి కాలు మాత్రమే శరీరం మొత్తం బరువును భరిస్తుంది. అందుకే కాళ్ళలో దృఢత్వం తగ్గి.. కొన్నిసార్లు తిమ్మిరి, నొప్పి ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉంటే పడుకునే ముందు పాదాలను కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు(Knee pains) తగ్గి కండరాలు చాలా ఉపశమనం పొందుతాయి.

పాదాలు ఎక్కువగా చెమట పడితే హైపర్ హైడ్రోసిస్(Hyper Hydrosis) అంటారు. అలాంటి సమస్య ఉన్న వ్యక్తి రాత్రిపూట కాళ్ళు కడుక్కుని నిద్రపోవాలి. దీని వలన పాదాలలో బ్యాక్టీరియా పెరగదు. అలాగే అథ్లెట్స్ ఫుట్(Athletes Foot) సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే ప్రస్తుతం ఈ బిజీ లైఫ్ స్టైల్ రోజు రన్నింగ్ వల్ల కాళ్ల కండరాలు, ఎముకల్లో నొప్పి వస్తుంది. పాదాల నొప్పులు ఎక్కువగా ఉంటే పాదాలు కడుక్కుని పడుకోవాలి. దీని వల్ల మనసు ప్రశాంతంగా ఉండడంతో పాటు శరీరం రిలాక్స్‌గా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం రాత్రి పడుకునే ముందు పాదాలను కడగడం మంచిదని భావిస్తారు. ఇది మంచి నిద్రను కలిగిస్తుంది. అలాగే ఒత్తిడి తగ్గుతుంది.

శరీరంలో వేడి ఎక్కువగా ఉండేవారు.. పాదాలు కడుక్కున్న తర్వాత నిద్రపోవాలి. రాత్రి పడుకునే ముందు పాదాలు కడుక్కోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. అలాగే పాదాలను నీటిలో నిమ్మరసం వేసి బాగా కడగాలి. ఇలా చేస్తే పాదాల నుంచి దుర్వాసన రాదు.

పాదాలను చల్లని, సాధారణ లేదా గోరువెచ్చని నీటితో కూడా కడగడం మంచిది. అందుకు బకెట్‌లో నీళ్లు తీసుకుని అందులో నిమ్మకాయ కట్ చేసి వేయాలి.. ఇప్పుడు అందులో పాదాలను కాసేపు ఉంచండి. 15 నిమిషాల పాటు అలాగే ఉంచిన తర్వాత, పాదాలను బయటకు తీసి, వాటిని పూర్తిగా తుడిచి, వాటిపై క్రీమ్ లేదా ఆయిల్ రాస్తే తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

Updated On 21 Jun 2023 12:28 AM GMT
Ehatv

Ehatv

Next Story