రోజూ నడిస్తే(Walking) బరువు(Weight) తగ్గుతారు.. అరగంటపాటు నడవడంతో మంచి ఆక్సీజన్ అంది ఊపిరితిత్తుల(Lungs) సామర్థ్యాన్ని పెంచుతుంది. గుండె(Heart) ఆరోగ్యంగా ఉంటుంది. మానసికంగా ధృడంగా ఉండడంతో పాటు వైవిధ్య ఆలోచనలు కలిగిస్తుందని చెప్తున్నారు. ప్రతీరోజు నడవడం వల్ల గుండెపోటు(Heart) ప్రమాదాన్ని నివారిస్తుంది. జీర్ణప్రక్రియను(Digestion) సులభం చేస్తుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడేస్తుంది మన నడక

Walking Health Tips
రోజూ నడిస్తే(Walking) బరువు(Weight) తగ్గుతారు.. అరగంటపాటు నడవడంతో మంచి ఆక్సీజన్ అంది ఊపిరితిత్తుల(Lungs) సామర్థ్యాన్ని పెంచుతుంది. గుండె(Heart) ఆరోగ్యంగా ఉంటుంది. మానసికంగా ధృడంగా ఉండడంతో పాటు వైవిధ్య ఆలోచనలు కలిగిస్తుందని చెప్తున్నారు. ప్రతీరోజు నడవడం వల్ల గుండెపోటు(Heart) ప్రమాదాన్ని నివారిస్తుంది. జీర్ణప్రక్రియను(Digestion) సులభం చేస్తుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడేస్తుంది మన నడక. ప్రతీరోజు అరగంట నుంచి 45 నిమిషాలు నడిస్తే చాలు, మోకాళ్ల కండరాలు బలపడతాయి. వృద్ధాప్యంలో వైకల్యాన్ని నివారిస్తుంది. మనిషిని ఫిట్‌గా ఉంచుతుంది. నడక వల్ల ఎముకలు బలోపేతం అవుతాయి. శరీరంలో ఉన్న అదనపు కొవ్వును తగ్గించడానికి నడక ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు ఈ నడక వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది, జలుబు లేదా ఫ్లూ బారినపడకుండా కాపాడుతుందంటున్నారు. సో నిద్రమత్తు వదలండి.. నడవడం ప్రారంభించండి..
