అరటి పండు(Banana).. శరీరానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇందులో అనేక పోషక విలువలు ఉన్నందున ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాకుండా.. ఇందులో చాలా మినరల్స్(Minerals), యాంటీఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక దీని తొక్కలోనూ(Peal) అనేక యాంటీ ఆక్సిడెంట్స్(Antioxidants) ఉన్నాయి. అయితే మనం అరటి పండు తినగానే తొక్క బయటపడేస్తాము.

అరటి పండు(Banana).. శరీరానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇందులో అనేక పోషక విలువలు ఉన్నందున ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాకుండా.. ఇందులో చాలా మినరల్స్(Minerals), యాంటీఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక దీని తొక్కలోనూ(Peal) అనేక యాంటీ ఆక్సిడెంట్స్(Antioxidants) ఉన్నాయి. అయితే మనం అరటి పండు తినగానే తొక్క బయటపడేస్తాము. కానీ దాని పీల్ తో చర్మ సమస్యలను తగ్గించడంలో సహయపడుతుంది. ఇది చర్మ సమస్యలను నయం చేయడంతోపాటు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. చర్మ సంరక్షణలో అరటి తొక్కను ఎలా ఉపయోగించవచ్చు అనేది తెలుసుకుందామా.

అరటి తొక్కల వల్ల కలిగే ప్రయోజనాలు...
హెల్త్‌లైన్ ప్రకారం.. అరటి తొక్కలతో ముడతల(Wrinkles) సమస్యను తగ్గించుకోవచ్చు. ఇది కాకుండా చర్మంపై దాని తొక్కలను రుద్దితే, చర్మం కాంతివంతంగా(Skin Glow), ప్రకాశవంతంగా మారుతుంది. అంతే కాదు, కళ్ల చుట్టూ ఉబ్బినట్లు లేదా వాపు ఉంటే, కళ్లపై ఉంచితే, వాపు కూడా తగ్గుతుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి, మొటిమల మచ్చలను తొలగించడానికి కూడా ఉపయోగించవచ్చు.

ఫేస్ మాస్క్ తయారు చేయడం..
అరటిపండు తొక్కతో ఫేస్ ప్యాక్(Face Mask) తయారుచేయాలంటే ముందుగా అరటిపండు తొక్కను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక చెంచా తేనె, ఒక చెంచా పెరుగు, 2 అరటిపండు ముక్కలను వేసి మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. ఇప్పుడు దానిని ఒక గిన్నెలోకి తీసుకుని మెడ, ముఖాన్ని శుభ్రంగా తుడవండి. ఇప్పుడు జాగ్రత్తగా ముఖం అంతా అప్లై చేయండి. 15 నిమిషాల పాటు అలాగే ఉంచిన తర్వాత ముఖం కడుక్కోవాలి. ముఖంలోని ప్రతి సమస్య దూరమవుతుంది.

అలా కాకుండా అరటిపండు తొక్కను నేరుగా మీ చర్మంపై కూడా రుద్దుకోవచ్చు. దీని కోసం ముందుగా ముఖాన్నిశుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత తేలికపాటి చేతులతో చర్మంపై ఈ తొక్కలను రుద్దండి. తర్వాత 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

Updated On 19 Jun 2023 11:52 PM GMT
Ehatv

Ehatv

Next Story