మనం అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళ్లడానికి వెంటనే తత్కాల్ రైల్వే టిక్కెట్‌ను(Tatkal Railway Ticket) బుక్ చేసుకుంటాము. కానీ మనకు కన్ఫార్మ్ టికెట్ మాత్రం దొరకదు. తత్కాల్ బుకింగ్ చేసే చాలామంది వెంటనే టికెట్ కావాలి అనుకుంటారు. అందుకు తత్కాల్ కోటా నుండి కన్ఫార్మ్ సీటు కావాలని చూస్తుంటారు. కానీ రైల్వేలో ఉన్న తత్కాల్ కోటాలో పరిమిత సీట్లు ఉన్నందున, అందరికీ కన్ఫార్మ్ టికెట్ దొరకదు. అటువంటి పరిస్థితిలో ముందుగా తమ వివరాలను ఎంటర్ చేసి డబ్బు చెల్లించే ప్రయాణీకులకు మాత్రమే వారి టిక్కెట్లు కన్ఫార్మ్ చేయబడతాయి.

మనం అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళ్లడానికి వెంటనే తత్కాల్ రైల్వే టిక్కెట్‌ను(Tatkal Railway Ticket) బుక్ చేసుకుంటాము. కానీ మనకు కన్ఫార్మ్ టికెట్ మాత్రం దొరకదు. తత్కాల్ బుకింగ్ చేసే చాలామంది వెంటనే టికెట్ కావాలి అనుకుంటారు. అందుకు తత్కాల్ కోటా నుండి కన్ఫార్మ్ సీటు కావాలని చూస్తుంటారు. కానీ రైల్వేలో ఉన్న తత్కాల్ కోటాలో పరిమిత సీట్లు ఉన్నందున, అందరికీ కన్ఫార్మ్ టికెట్ దొరకదు. అటువంటి పరిస్థితిలో ముందుగా తమ వివరాలను ఎంటర్ చేసి డబ్బు చెల్లించే ప్రయాణీకులకు మాత్రమే వారి టిక్కెట్లు కన్ఫార్మ్ చేయబడతాయి. ఈ పరిస్థితులలో కొందరు టికెట్ కోసం ఏజెంట్లు లేదా మధ్యవర్తుల సహాయం తీసుకుంటారు. ఇక వారు తమ కమీషన్‌ను(Commission) కూడా జత చేసి టిక్కెట్‌ను చాలా ఎక్కువ ధరకు విక్రయిస్తుంటారు. అలా కాకుండా మీరు నేరుగా బుక్ చేసుకోవడం ద్వారా కన్ఫార్మ్ టికెట్ ఎలా పొందాలి?.. ఈ సమస్య నుండి బయటపడాలి ?.. మీ టికెట్ కన్ఫార్మ్ అయ్యే అవకాశాలు ఏంటీ అనేది తెలుసుకోవాలంటే ఈ విషయాలు గమనించండి.

రైల్వేలో తత్కాల్ టికెట్ బుకింగ్ ఎప్పుడు ప్రారంభమైనా చాలా మంది ఒకేసారి బుకింగ్ స్టార్ట్ చేస్తారు. ఇక అదే సమయంలో తత్కాల్ కోటాలో సీట్లు కూడా పరిమితంగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో అందరికీ టికెట్ కన్ఫార్మ్ చేయడం సాధ్యం కాదు. తత్కాల్ బుకింగ్‌లో టైమింగ్ చాలా ముఖ్యమైన విషయం. తత్కాల్ టికెట్ పొందడం అనేది మీరు ఎంత త్వరగా అయితే తొందరగా అన్ని వివరాలను ఎంటర్ చేసి.. అమౌంట్ పే చేసారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ప్రయాణీకుల వివరాలను ఎంటర్ చేయడానికి చాలా సమయం పడుతుంది. అప్పుడే అన్ని సీట్లు బుక్ చేయబడతాయి.

ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి?
ప్రయాణీకులు ఈ సమస్యను అధిగమించడానికి IRCTC మాస్టర్ జాబితా సౌకర్యాన్ని ప్రారంభించింది. ఇందులో టికెట్ బుక్ చేసుకునే ముందు కూడా ప్రయాణికుడి వివరాలను సేవ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత టికెట్ బుక్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ వివరాల సాయంతో వెంటనే టికెట్ బుక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కన్ఫార్మ్ టికెట్ పొందడం లేదా పొందకపోవడం కూడా సీటు దొరకడం మీదే ఆధారపడి ఉంటుంది. కానీ దీనితో మీరు ముందుగానే సీటును బుక్ చేసుకోగలరు. దీని వలన కన్ఫార్మ్ టికెట్ పొందే అవకాశాలు చాలా వరకు ఉంటాయి.

Updated On 11 Jun 2023 1:07 AM GMT
Ehatv

Ehatv

Next Story