ఎండలు విపరీతంగా ఉన్నాయి. సూర్యకాంతి(sunrays), చెమట(sweat) కారణంగా చర్మ సమస్యలు మరింత వేధిస్తున్నాయి. అంతేకాకుండా ముఖంపై మొటిమలు(pimples), మచ్చలు(Dark spots) మరింత తీవ్రతరం అవుతున్నాయి. చాలా మంది చర్మం పొడిగా(Dry skin) మారుతుంది. దీంతో చర్మపై ముడతలు(Wrinkles) ఏర్పడడం, చర్మం నిర్జీవంగా మారడం కనిపిస్తుంది.

ఎండలు విపరీతంగా ఉన్నాయి. సూర్యకాంతి(sunrays), చెమట(sweat) కారణంగా చర్మ సమస్యలు మరింత వేధిస్తున్నాయి. అంతేకాకుండా ముఖంపై మొటిమలు(pimples), మచ్చలు(Dark spots) మరింత తీవ్రతరం అవుతున్నాయి. చాలా మంది చర్మం పొడిగా(Dry skin) మారుతుంది. దీంతో చర్మపై ముడతలు(Wrinkles) ఏర్పడడం, చర్మం నిర్జీవంగా మారడం కనిపిస్తుంది. అలాగే ముఖంపై టాన్(Tan) పెరుకుపోయి మరింత నల్లగా మారుతుంది. ఇవే కాకుండా మీ ముఖం మెరుపు తప్పిపోయి మరింత నిర్జీవంగా కనిపిస్తుంది. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు కెమికల్ ప్రొడక్ట్స్ వాడకుండా ఇంట్లో ఉండే కలబంద గుజ్జు(Alovera gel) ఉపయోగించవచ్చు. ఈ సమస్యల నుంచి విముక్తి పొందేందుకు కలబంద గుజ్జులో, విటమిన్ ఇ క్యాప్సూల్స్ కలిపి ముఖానికి అప్లై చేస్తే చాలు ముఖంపై మొటిమలు తగ్గిపోయి మరింత కాంతివంతగా మారుతుంది.

ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి
విటమిన్ ఇ(Vitamin E), అలోవెరా జెల్(alovera gel) చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఇవి చర్మ సంరక్షణలో ఎక్కువగా ఉపయోగపడతాయి. చర్మ సమస్యలను తొలగించుకోవడానికి ఈ రెండింటిని ఉపయోగించి ఫేస్ ప్యాక్ రెడీ చేసుకుని అప్లై చేస్తే చాలు.

తయారుచేసే విధానం
ఒక చిన్న గిన్నెలో రెండు చెంచాల అలోవెరా జెల్‌ని తీసుకోండి. ఈ జెల్‌ను మార్కెట్‌లో దొరుకుతుంది.. అలాగే ఇంట్లోనే కలబంద చెట్టును ఉపయోగించవచ్చు. ఇప్పుడు 2 విటమిన్ ఇ క్యాప్సూల్స్ తీసుకొని దానిలో చిన్న రంధ్రం చేసి దానిలోని నూనె మొత్తాన్ని అలోవెరా జెల్‌లో వేయండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టాలి. ఆ తర్వాత మీ ముఖాన్ని శుభ్రంగా కడిగి.. ఈ పేస్ట్ ముఖంపై అప్లై చేయాలి. దీనిని 15 నిమిషాల పాటు ఉండనివ్వాలి. అయితే ఆ సమయంలో మీ చేతివేళ్లతో ముఖంపై వృత్తాకారంలో మసాజ్ చేయండి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. ఆ తర్వాత ఐస్ వాటర్ తీసుకుని ముఖంపై చల్లుకోవాలి. ప్రతి వారం ఈ ఫేస్ ప్యాక్ ను మీ ముఖానికి అప్లై చేస్తే ముఖం మరింత అందంగా కనిపిస్తుంది.

Updated On 18 Jun 2023 12:28 AM GMT
Ehatv

Ehatv

Next Story