బయట దేశాల్లో ఏమో కానీ మన దగ్గర మాత్రం పెళ్లి(Marriage) అనేది ఓ సామాజిక అవసరం. ఈ తరం వారిలో కొందరికి పెళ్లి వయసు వచ్చినా పెళ్లి కావడం లేదు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. తల్లిదండ్రులకు ఇదో సమస్యగా మారింది. పెళ్లి కావడం కోసం పూజలు చేస్తుంటారు. మొక్కులు మొక్కుకుంటారు. నాగదోష(Naga Dosham) పూజలు చేయిస్తుంటారు.
బయట దేశాల్లో ఏమో కానీ మన దగ్గర మాత్రం పెళ్లి(Marriage) అనేది ఓ సామాజిక అవసరం. ఈ తరం వారిలో కొందరికి పెళ్లి వయసు వచ్చినా పెళ్లి కావడం లేదు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. తల్లిదండ్రులకు ఇదో సమస్యగా మారింది. పెళ్లి కావడం కోసం పూజలు చేస్తుంటారు. మొక్కులు మొక్కుకుంటారు. నాగదోష(Naga Dosham) పూజలు చేయిస్తుంటారు. అయితే తమిళనాడు(Tamil Nadu)
లో ఉన్న ఓ శివాలయానికి వెళితే మాత్రం ఏడాది తిరక్కుండానే పెళ్లి జరుగుతుందట! ఆ గుడి తంజావూరు(Thanjavur) జిల్లా కుట్టాలం దగ్గర ఉంది. కుట్టాలం నుంచి ఆరు కిలోమీటర్లు వెళితే కళ్యాణ సుందర్ ఆలయం(Kalyana Sundar Temple) వస్తుంది. పేరులోనే కళ్యాణం ఉంది కదా! కావేరీ నదీ ఒడ్డున ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరులు పాణిగ్రహణ స్థితిలో దర్శనమిస్తారు. అంటే చేతిలో చేయి వేసిపట్టుకున్నట్టు! ఇక్కడే ఆ ఆదిదంపతుల వివాహం జరిగిందని స్థానికులు చెబుతుంటారు. ఇది పవిత్రమైన స్థలం కాబట్టే పెళ్లి కాని వారు పార్వతీపరమేశ్వరులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తే ఏడాది తిరిగేలోపు పెళ్లి జరుగుతుందన్నది భక్తుల విశ్వాసం. ఇక తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలో కూడా ఇలాంటి ఆలయమే ఉంది. లాల్‌గుడి బ్లాక్‌లో ఉన్న ఈ ఆలయం పేరు మంగళాంబి సమేత మాంగళీశ్వర దేవాలయం. మాంగల్య మహర్షి ఇక్కడ విరివిగా వివాహాలను నిర్వహించారని చెబుతుంటారు. ఈ దేవుడి ఆశీస్సుల వల్లే భైరవ, వశిష్ట, అగస్త్య మహామునిల వివాహాలు జరిగాయట. ముఖ్యంగా ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు క్రమం తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. మాంగల్య మహర్షి స్వయంగా ఉత్తర నక్షత్రంలో జన్మించాడని పురణాలు చెబుతున్నాయి.ఆయన దేవదూతలకు గురువు కావడం వల్ల ఆయన ఆశీర్వాద బలంతో త్వరితగతిన వివాహాలు జరుగుతాయట! పెళ్లికి సంబంధించిన ప్రతీ ముహూర్తాన్ని దేవదూతలు ఆశీర్వదిస్తారట!