మరణం అంటే ఏమిటి? మరణం ముందు ఏం జరుగుతుంది? మరణం తర్వాత ఏం మిగులుతుంది? దేనివల్ల ప్రేరేపితమై ప్రాణం తన పని తాను చేసుకుంటూ పోతున్నది? ఇవన్నీ అంతుపట్టని రహస్యాలే! చావు చెప్పి రాదు! ఒక్కొక్క జీవిని ఒక్కో రకంగా మృత్యుదేవత తీసుకెళుతుంటుంది. కొందరు అకాలంగా మరణిస్తారు. ఇంకొందరు ప్రమాదవశాత్తూ చనిపోతారు.

మరణం అంటే ఏమిటి? మరణం ముందు ఏం జరుగుతుంది? మరణం తర్వాత ఏం మిగులుతుంది? దేనివల్ల ప్రేరేపితమై ప్రాణం తన పని తాను చేసుకుంటూ పోతున్నది? ఇవన్నీ అంతుపట్టని రహస్యాలే! చావు చెప్పి రాదు! ఒక్కొక్క జీవిని ఒక్కో రకంగా మృత్యుదేవత తీసుకెళుతుంటుంది. కొందరు అకాలంగా మరణిస్తారు. ఇంకొందరు ప్రమాదవశాత్తూ చనిపోతారు. మరికొందరు అనారోగ్యంతో కన్నుమూస్తారు. మరణం ఒక యాతన. దాన్ని కావాలని ఎవరూ కోరుకోరు కానీ కొందరు మాత్రం చనిపోయే ముందు నవ్వుతూ ఉంటారు. ఇలా మరణించడాన్ని స్మైలింగ్‌ డెత్‌ అంటారు. క్రష్‌ సిండ్రోమ్‌ అని కూడా పిలుస్తారు. ఆఖరి నిమిషాల్లో ఎంతటి బాధ ఉన్నా నవ్వుతూ చనిపోతారు. ఎందుకిలా? అసలు స్మైలింగ్‌ డెత్‌ అంటే ఏమిటి? ప్రకృతి వైపరీత్యాలలో చిక్కుకున్న వ్యక్తి రక్తంలో పొటాషియం అధిక మోతాదులో విడుదలవుతుంది. ఈ కారణంగా హృదయ స్పందనలో సమతుల్యత లోపిస్తుంది. ఇలాంటి సందర్భాలలో మనిషి షాక్‌తో మరణిస్తాడు. చనిపోవడానికి ముందు అసంకల్పితంగానే నవ్వడం మొదలుపెడతాడు. లోలోప ఎంత నొప్పిని అనుభవిస్తున్నా బయటకు మాత్రం నవ్వుతూనే ఉంటాడు. అలా నవ్వుతూనే చనిపోతాడు. అందుకే దీనిని స్మైలింగ్‌ డెత్‌ అంటారు. 1923లో జపాన్‌కు చెందిన స్కిన్‌ స్పెషలిస్ట్‌ సీగో మినామా మొదటిసారిగా క్రష్‌ సిండ్రోమ్‌ అనే వ్యాధిని గుర్తించాడు. ఆ సమయంలో మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధంలో మూత్రపిండాలు చెడిపోయి చాలా మంది చనిపోయారు. అలా చనిపోయిన ముగ్గురు సైనికుల పాథాలజీని అధ్యయనం చేశారు సీగో మినామి. 1941లో ఇంగ్లాండ్‌కు చెందిన ఎరిక్‌ జార్జ్‌ లాపథోర్న్‌ అనే డాక్టర్‌ కూడా క్రష్‌ సిండ్రోమ్‌పై పరిశోధనలు చేశాడు. భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, రోడ్డు ప్రమాదాలు వంటి సందర్భాలలో క్రష్‌ సిండ్రోమ్‌ కేసులు కనిపిస్తుంటాయని ఆయన అధ్యయనంలో తేలింది. 1999లో ఉత్తర టర్కీలో సంభవించిన భూకంప మరణాలలో 15 శాతానికి పైగా స్మైలింగ్‌ డెత్‌లు ఉన్నాయి. క్రష్‌ సిండ్రోమ్‌ అనేది తీవ్రమైన నొప్పితో కూడిన ఓ రకమైన రిపెర్ఫ్యూజన్‌ గాయమని బ్రిటిస్‌ మెడికల్ జర్నల్‌ అంటోంది. శిథిలాలలో ఎవరైనా అయిదారు గంటల పాటు చిక్కుకుని ఉంటే అతడు క్రష్‌ సిండ్రోమ్‌ స్థితికి లోనవుతాడు. ఒక్కోసారి ఈ పరిస్థితి గంటలోనే ఏర్పడవచ్చు. క్రష్‌ సిండ్రోమ్‌కు గురైన వ్యక్తిలో ఎలాంటి భావాలు ఉండవు. చివరి క్షణంలో అసమంజసమైన రీతిలో ఆలోచిస్తాడు. మరణం సమీపిస్తున్న సమయంలో తెల్లటి కాంతిని, చనిపోయిన తన బంధువులను చూస్తాడని, వింత వింత శబ్ధాలను వింటాడని అమెరికాలోని మిచిగాన్‌ యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు.

Updated On 28 Aug 2023 7:49 AM GMT
Ehatv

Ehatv

Next Story