Nightmares : పీడకలలు ఎందుకు వస్తాయి..? కారణం ఏంటి..?
కలలు(dreams) అంటే మన ఆలోచనలే అని అంటుంటారు. సాధారణంగా చాలా మంది కలలను పట్టించుకోరు. కాని అనుకున్నదానికి విరుధ్దంగా.. అంటే భయంకరంగా ఏమైనా కల కన్నప్పుడు మాత్రం నిజంగా షాక్ అవుతాము. వాటినే మనం పీడకలలు అంటుంటాం. ఇవి మన నిద్రను ప్రభావింత చేయడమే కాదు.. ఆరోజును కూడా ఇబ్బందికరంగా మార్చుతాయి.

Nightmares
కలలు(dreams) అంటే మన ఆలోచనలే అని అంటుంటారు. సాధారణంగా చాలా మంది కలలను పట్టించుకోరు. కాని అనుకున్నదానికి విరుధ్దంగా.. అంటే భయంకరంగా ఏమైనా కల కన్నప్పుడు మాత్రం నిజంగా షాక్ అవుతాము. వాటినే మనం పీడకలలు అంటుంటాం. ఇవి మన నిద్రను ప్రభావింత చేయడమే కాదు.. ఆరోజును కూడా ఇబ్బందికరంగా మార్చుతాయి.
మరి అలాంటి కలలు ఎందుకు వస్తాయి. కారణం ఏంటి..? మన మెదడులోని రసాయనాల(Chemical) అసమతుల్యత వల్లనా లేక మరేదైనా కారణమా? నిపుణులు చెప్పిన దాని ప్రకారం కలలు మన మనస్సులో రోజులోని ఆలోచనలు మరియు సంఘటనలను ప్రాసెస్ చేయడంలో సహాయపడతాయి. ఉదాహరణకు, కలలు మెదడు కార్యకలాపాలలో భాగం. ఇది మీ భావోద్వేగాలకు సబంధించిన పని.
సాధారణ కల అయినా, పీడకల అయినా.. దాని వెనుక కారణాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. దాని ఖచ్చితమైన కారణం ఇది అని ఎవరూ చెప్పలేకపోతున్నారు. కానీ మెదడు గురించి జరిగిన పరిశోధనల్లో కలల గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకోగలిగారు. కలలు కనడానికి సాధారణ కారణం రోజువారీ జీవితంలో ఒత్తిడి కూడా కావచ్చు.
స్కూల్ పిల్లలు కాని.. పని ఒత్తిడి ఉన్నవారు కాని.. ఇతరులకంటే ఎక్కువ కలలు కంటారు. ఇది కాకుండా, కొన్ని ప్రధాన జీవిత సంఘటనలు లేదా ప్రియమైన వ్యక్తి మరణం వంటి జీవితంలో మార్పులు కూడా పీడకలలకు కారణమవుతాయి. రాపిడ్ ఐ మూమెంట్ (REM) అనేది నిద్ర యొక్క దశ. ఇది వేగవంతమైన కంటి కదలికలు, క్రమరహిత హృదయ స్పందనలు మరియు పెరిగిన శ్వాసకోశ రేటుకు కారణమవుతుంది.
REM నిద్ర ఎక్కువ కాలం ఉన్నప్పుడు కలలు వస్తాయని హార్వర్డ్ పరిశోధకులు నివేదించారు. ఇది కాకుండా, ఒత్తిడి, ఆందోళన, సరిగ్గా నిద్రపోకపోవడం.. మధ్యపానం, మాదకద్రవ్యాల వినియోగం, మానసిక రుగ్మతలు మొదలైన అనేక కారణాల వల్ల పీడకలలు తలెత్తుతాయి అని అంటున్నారు. కానీ అతిగా పీడకలలు రావడానికి మాత్రం ప్రధాన కారణం PTSD అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటున్నారు నిఫుణులు.
