శరీరం ఎంత అందంగా కనిపించినప్పటికీ మెడ(Neckk), మోచేతులు(elbows), మోకాళ్లు(knees) బాగా నల్లగా ఉండిపోతాయి. ఇవి అందాన్ని మరింత తగ్గిస్తాయి. ఈ ప్రదేశాలు ఎప్పుడూ నలుపుగా ఉండడమే కాకుండా.. రగ్గడ్ గా ఉంటాయి. ఫలితంగా నచ్చిన దుస్తులు ధరించడానికి కూడా ఆలోచనలో పడిపోతారు. మోకాళ్లు.. మోచేతుల నలుపు తగ్గించుకోవడానికి హోమ్ రెమిడీస్(home remedies), మార్కెట్లో లభించే ఉత్పత్తులు అన్ని ఉపయోగిస్తుంటారు.

శరీరం ఎంత అందంగా కనిపించినప్పటికీ మెడ(Neckk), మోచేతులు(elbows), మోకాళ్లు(knees) బాగా నల్లగా ఉండిపోతాయి. ఇవి అందాన్ని మరింత తగ్గిస్తాయి. ఈ ప్రదేశాలు ఎప్పుడూ నలుపుగా ఉండడమే కాకుండా.. రగ్గడ్ గా ఉంటాయి. ఫలితంగా నచ్చిన దుస్తులు ధరించడానికి కూడా ఆలోచనలో పడిపోతారు. మోకాళ్లు.. మోచేతుల నలుపు తగ్గించుకోవడానికి హోమ్ రెమిడీస్(home remedies), మార్కెట్లో లభించే ఉత్పత్తులు అన్ని ఉపయోగిస్తుంటారు. కానీ ఎలాంటి ఫలితం ఉండదు. ఈ ప్రదేశాలలో నలుపుదనం తొందరగా తొలగిపోదు. అందుకే కొన్ని పద్దతులు అనుసరించాల్సి ఉంటుంది. ఈ ప్రదేశాల్లో చర్మం కాస్త మొద్దుబారినట్టుగా ఉంటుంది. అందుకే కొంచెం అదనపు చర్మ సంరక్షణ అవసరం. చనిపోయిన చర్మ కణాలు తొలగిపోనప్పుడు, అవి అలాగే పేరుకుపోతాయి. ఈ మృతకణాలు పేరుకుపోయినప్పుడు ఆ ప్రాంతాలు ఎక్కువ ముదురు రంగులోకి మారుతాయి.

శరీరంలోని కొన్ని హార్మోన్ల మార్పుల వల్ల చర్మంపై నల్లటి మచ్చలు పెరుగుతాయి. అలాగే సూర్యుని వేడి వల్ల కలిగే UV కిరణాల కారణంగా, చర్మం నల్లబడి, చివరికి హైపర్పిగ్మెంటేషన్‌గా మారుతుంది. కెమికల్స్ ఎక్కువగా వాడటం వల్ల కూడా మెలస్మా వచ్చి చర్మం నల్లబడుతుంది. చర్మం పై నలుపును తగ్గించుకోవడం కోసం ఈ రెండు పద్దతులను అనుసరించండి.

1. నువ్వుల ప్యాక్(Sesame Seeds Pack)
దీనికి అవసరమైన పదార్థాలు..

కొబ్బరి నూనె(Coconut Oil) - 4 స్పూన్లు
ఆలివ్ నూనె(Olive Oil) - 2 స్పూన్లు
నువ్వుల నూనె(sesame oil) - 4 స్పూన్లు;

తయారు చేసే విధానం..
ముందుగా మిక్సీ జార్ లో నువ్వులు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొబ్బరి నూనె, ఆలివ్ నూనె వేసి బాగా కలపాలి. ఈ ప్యాక్‌ను చేతులు, మోకాళ్ళ పై అప్లై చేసి, రౌండ్ గా కదిలిస్తూ బాగా స్క్రబ్ చేయాలి. అలా 15 నిమిషాల పాటు ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ స్క్రబ్ చర్మంలోని మృతకణాలను తొలగిస్తుంది.

బాదం-వోట్మీల్ స్క్రబ్(Almond-Oatmeal Scrub)
కావలసినవి

బాదంపప్పు - 10
ఓట్స్ - 2 చెంచాలు,
రోజ్ వాటర్ - 4 చెంచాలు,

తయారు చేసే విధానం..
ముందుగా బాదంపప్పులను మిక్సీ జార్ లో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అందులో ఓట్స్ వేసి పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్‌ను రోజ్ వాటర్‌తో మిక్స్ చేసి, డార్క్ స్పాట్‌లో అప్లై చేసి వృత్తాకారంలో బాగా స్క్రబ్ చేయాలి. ఇలా వారంలో రెండు మూడు రోజులు చేస్తే చర్మంపై ఉండే పిగ్మెంటేషన్ తగ్గి, నలుపు పోయి, చర్మం మెరుస్తుంది.

Updated On 15 Jun 2023 2:19 AM GMT
Ehatv

Ehatv

Next Story