ఈరోజుల్లో ప్రతీ ఒక్కరికి ఉండే సమస్య.. దంత క్షయం.. ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరిగిపోతోంది. బ్యాక్టీరియా దంత క్షయానికి(Tooth decay) కారణమవుతుంది. ఈ కుళ్లిన దంతాల గురించి మొదట్లో జాగ్రత్తలు తీసుకోకపోతే దంతాలలో పెద్ద గుంట ఏర్పడి చిగుళ్ల ఇన్ఫెక్షన్లకు(Gums Infection) దారితీసి అనేక సమస్యలు వస్తాయి.

దంత క్షయాన్ని నివారించడానికి ఆయుర్వేదంలో ఎన్నో మార్గాలుఉన్నాయి. అవేంటంటే..?
ఇందులో ముఖ్కమైనది ఆయిల్ పుల్లింగ్(Oil Pulling)... ప్రతిరోజు ఉదయం నోటిలో ఎసెన్షియల్ ఆయిల్ పోసుకుని, 10 నిమిషాల పుక్కిలిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా మొత్తం తొలగిపోయి నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఇలా రోజూ చేస్తే దంత క్షయం రాకుండా చూసుకోవచ్చు.
2-3 చుక్కల లవంగం నూనెను(clove Oil) 1/4 టేబుల్ స్పూన్ ఆముదంతో కలపండి, ఆ నూనెను కాటన్ బాల్‌పై రాసి, రాత్రి పడుకునేటప్పుడు దూదిని పంటి ప్రాంతంలో ఉంచండి. ఇలా రోజూ చేస్తే మీ దంతాలకు సబంధించిన సమస్యలు వెంటనే తొలగిపోతాయి.
ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీటితో ఉప్పు కలపండి, మీ పళ్ళు తోముకునే ముందు దానిని మీ నోటిలో పోసుకుని 1 నిమిషం పాటు పుక్కిలించండి. ఇలా రోజుకు మూడు సార్లు తినే ముందు చేస్తే దంత క్షయం నుండి బయటపడవచ్చు
3-4 వెల్లుల్లి రెబ్బలను చూర్ణం చేసి, దానికి 1/4 టీస్పూన్ ఉప్పు వేసి, ఆ మిశ్రమాన్నిపుచ్చిపళ్లమీద 10 నిమిషాల తర్వాత నోరు శుబ్రం చేసుకోండి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు ఇలా చేస్తే, దంతక్షయానికి కారణమైన బ్యాక్టీరియా నాశనం చేయబడుతుంది.
వేప రసాన్ని దంతాల మీద రాసి 10 నిమిషాలు నానబెట్టి, తర్వాత గోరువెచ్చని నీటితో పుక్కిలించాలి. వీలైతే రోజూ వేప పొడితో పళ్ళు తోముకోవడం వల్ల దంత క్షయం నుండి బయటపడవచ్చు. వేప పుల్లలను కూడా దంతాలను శుబ్రం చేయడానికి వాడితే నోటిసమస్యలన్నీ తీరుతాయి.