రెండు అమావాస్యల మధ్య రవి సంక్రమణం జరగని నెలను అధిక మాసంగా పరిగణిస్తారు. చాంద్రమాన సంవత్సరానికి, సౌరమాన సంవత్సరానికీ ఉన్న కాల భేదాన్ని సరిచేయడానికి అధిక మాసం ఏర్పడుతూ ఉంటుంది. చాంద్రమానంలో ఒకనెలను అధికంగా కలిపి అధికమాసంగా పరిగణిస్తారు. చాంద్రమానంలో ఒక నెల అంటే సుమారు 29.53 రోజులకు సమానం. దీని ప్రకారం సంవత్సరానికి సుమారు 354 రోజులు వస్తాయి.

రెండు అమావాస్యల మధ్య రవి సంక్రమణం జరగని నెలను అధిక మాసంగా పరిగణిస్తారు. చాంద్రమాన సంవత్సరానికి, సౌరమాన సంవత్సరానికీ ఉన్న కాల భేదాన్ని సరిచేయడానికి అధిక మాసం ఏర్పడుతూ ఉంటుంది. చాంద్రమానంలో ఒకనెలను అధికంగా కలిపి అధికమాసంగా పరిగణిస్తారు. చాంద్రమానంలో ఒక నెల అంటే సుమారు 29.53 రోజులకు సమానం. దీని ప్రకారం సంవత్సరానికి సుమారు 354 రోజులు వస్తాయి. అంటే చాంద్రమాన సంవత్సరంలో సౌరమాన సంవత్సరం కన్నా 11 రోజుల, ఒక గంటా 31 నిమిషాల 12 సెకండ్లు తక్కువగా ఉంటాయన్నమాట! ఆ లెక్కన ప్రతి 32.5 నెలల్లో చాంద్రమాన సంవత్సరం, సౌర మాన సంవత్సరం కంటే 30 రోజులు వెనకబడుతుంది. ఈ 30 రోజులను సవరించడానికి ఓ నెలను అధికంగా కలుపుతారు. చాంద్రమాన సంవత్సరాన్ని సౌరమాన సంవత్సరంతో సమానం చేయడానికి ఆ సంవత్సరంలో ఒక నెలను అధికంగా కలుపుతారు. అధికంగా కలిపే నెలనే అధికమాసం అంటారు. అధికమాసం సుమారుగా ప్రతి 32 నెలలకు ఒకసారి వస్తుంది. ఈసారి
అధిక శ్రావణమాసం వచ్చింది. అధిక శ్రావణం(Adhika shravanam) 19 ఏళ్లకు ఒకసారి వస్తుంది. అధిక మాసం ఎప్పుడూ వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజ మాసాలకు మాత్రమే వస్తుంది. ఒకసారి అధిక మాసం వచ్చాక తిరిగి 28 నెలలకు మరోసారి వస్తుంది. ఆ తర్వాత 34, 34, 35, 38 నెలలకు ఇలా అధికమాసం ఏర్పడుతూ ఉంటుంది. అధిక మాసం ముందు వచ్చి ఆ తర్వాత నిజ మాసం వస్తుంది. ఈ అధిక మాసాన్ని మైల మాసం అని కూడా అంటారు. ధర్మ సింధువు ప్రకారం అధిక మాసంలో ఉపాకర్మ, ఉపనయనం, వివాహం, వాస్తుకర్మ, గృహప్రవేశం, దేవతా ప్రతిష్ఠ, యజ్ఞం, సన్న్యాసాశ్రమ స్వీకారం, రాజాభిషేకం, అన్న ప్రాశనం, నామకరణం మొదలైన కార్యక్రమాలు చేయకూడదు. తెలుగు పంచాంగం ప్రకారం జులై 18 న అధిక శ్రావణ మాసం ప్రారంభమయ్యింది. ఆగస్టు 16వ తేదీన ముగుస్తుంది. ఆగస్టు 17 నుంచి అసలు శ్రావణ మాసం ప్రారంభమవుతుంది..

Updated On 1 Aug 2023 2:01 AM GMT
Ehatv

Ehatv

Next Story