టీ, కాఫీ లేకుండా పూట గడవదు చాలా మందికి. కానీ తాగేటప్పుడు ఎంత జాగ్రత్తగా తాగినా.. ఒక్కోసారి అనుకుండా బట్టలపై పడి మరకలు పడటం సర్వసాధారణంగా జరగుతూ ఉంటుంది. చిన్న చుక్క పడినా ఆ మరక ఈజీగా పోదు. సబ్బుతో రుద్దినా పోదు. ఈ టిప్స్‌తో వాటిని క్లాస్‌ పాడవకుండా కేవలం మరకను మాత్రమే సులభంగా వదిలించొచ్చు.

టీ, కాఫీ లేకుండా పూట గడవదు చాలా మందికి. కానీ తాగేటప్పుడు ఎంత జాగ్రత్తగా తాగినా.. ఒక్కోసారి అనుకుండా బట్టలపై పడి మరకలు పడటం సర్వసాధారణంగా జరగుతూ ఉంటుంది. చిన్న చుక్క పడినా ఆ మరక ఈజీగా పోదు. సబ్బుతో రుద్దినా పోదు. ఈ టిప్స్‌తో వాటిని క్లాస్‌ పాడవకుండా కేవలం మరకను మాత్రమే సులభంగా వదిలించొచ్చు.
హాట్‌ వాటర్‌:
కాట¯Œ దుస్తులపై కాఫీ, టీ మరకలు పడితే..పోగొట్టడం మహా కష్టం. ఆ మరకను సులభంగా వదిలించడానికి మరకపడిన ప్లేస్‌లో వేడి నీళ్లు పోయాలి. నీళ్లు మరీ వేడిగా ఉండకుండా చూసికోండి. నీళ్లు మరీ వేడిగా ఉంటే దుస్తుల దారపు పోగులు దెబ్బతింటాయి. కాస్త వేడి నీళ్లు పోసి అప్పుడు సబ్బుతో రుద్దితే మరక పోతుంది.
టూత్‌ పేస్ట్‌:
కాఫీ, టీ మరకలు టూత్‌ పేస్ట్‌ ఈజీగా పోతాయి. మరకపడిన చోట.. టూత్‌పేస్ట్‌ పూసి ఇరవై నిమిషాలు పక్కనపెట్టాలి. 20 నిమిషాల తర్వాత నీటితో ఆ బట్టలను ఉతికేస్తే మరక మటుమాయం అవుతుంది.
బేకింగ్‌ సోడా:
బేకింగ్‌ సోడాలో గోరువెచ్చని నీళ్లు పోసి పేస్ట్‌గా చేసి.. ఆ పేస్ట్‌ని మరక మీద పూస్తే.. మరక మాయం అయిపోతుంది. ప్రయత్నించి చూడండి.
గుడ్డు పచ్చసొన:
కాఫీ, టీ మరకల్ని వదిలించడానికి.. గుడ్డు పచ్చసొన బాగా యూజ్‌ అవుతుంది. గుడ్డు పచ్చసొనను బాగా గిలకొట్టి.. మరక ఉన్న ప్రదేశంలో వేసి రుద్దాలి. తర్వాత సబ్బుతో వస్త్రాన్ని బాగా ఉతకాలి. లేదంటే గుడ్డు స్మెల్‌ వస్తుంది.
వెనిగర్‌:
మరక పడిన చోట వెనిగర్‌ వేసి రుద్దితే దుస్తుల రంగు మారిపోకుండా.. మరక మాత్రమే పోతుంది. కొన్ని నీళ్లలో చెంచా వెనిగర్‌ వేసి బాగా కలిపి.. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో పోసి మరక పడిన చోట స్ప్రే చేసి, నెమ్మదిగా రుద్దాలి. ఇలా చేస్తే మరక పోతుంది.
లిక్విడ్‌ డిటర్జెంట్‌:
లిక్విడ్‌ డిటర్జెంట్‌ను మరకపడిన చోట వేసి రుద్ది.. 20 నిమిషాల పాటు అలానే ఉంచి, ఉతికితే.. కాఫీ, టీ మరకలు పోతాయి.
నిమ్మరసం:
టీ, కాఫీ మరకలు తొలగిపోవాలంటే.. నిమ్మరసాన్ని యూజ్‌ చెయ్యాలి. మరకపడిన చోట నిమ్మరసం వేసి బాగా రుద్దాలి. ఆ తర్వాత సబ్బునీళ్లల్లో ఆ దుస్తులు ఉతకాలి. ఇలా చేస్తే బట్టలపై ఉన్న టీ, కాఫీ మరకలు వదులుతాయి. ట్రై చేసి చూడండి.

Updated On 15 April 2023 1:03 AM GMT
Ehatv

Ehatv

Next Story