చాలా మంది ఆడవారిలో ఈ సమస్య కారణంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.అయితే ఈ సమస్యకు ఖరీదైన కాస్మొటిక్స్ ఏమి వాడవలసిన అవసరం లేదు. కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.ఈ సమస్యను పసుపు సమర్ధవంతంగా పరిష్కారం చూపుతుంది.

Unwanted Hair Removing Tips
చాలా మంది ఆడవారిలో ఈ సమస్య కారణంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.అయితే ఈ సమస్యకు ఖరీదైన కాస్మొటిక్స్ ఏమి వాడవలసిన అవసరం లేదు. కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.ఈ సమస్యను పసుపు సమర్ధవంతంగా పరిష్కారం చూపుతుంది.
రోజు కాని.. రోజు విడిచి రోజు కాని.. సున్నిపిండితో(flour) స్నానంచేయండి.. అవాంచితరోమాలు(Unwanted hair) .. రాను రాను తొలగిపోతాయి. అంతే కాదు చర్మానికి పేరుకుపోయిన మురికి మట్టి మటుమాయం అవుతుంది. ఇలా చేసి చూడండి.. చర్మ కాంతి వంతంగామెరుస్తుంది. ముఖ్యంగా పెసరపిండి(Sesame Flour) తో స్కానం చేయండి చక్కటిమేని ఛాయతో మెరుస్తుంది.
ఒక స్పూన్ పసుపులో(Turmeric) పాలు పోసి పేస్ట్ గా తయారుచేయాలి.ఈ పేస్ట్ ని అవాంఛిత రోమాలు ఉన్న ప్రదేశంలో రాసి 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఒకవేళ వెంట్రుకలు ఎక్కువగా ఉంటే శనగపిండిలో బియ్యంపిండి,పసుపు వేసి నీటిని కలిపి పేస్ట్ గా చేసి ముఖానికి రాసి 5 నిముషాలు అయ్యాక స్క్రబ్ చేయాలి.
బంగాళాదుంపలో(Potato) సహజసిద్ధమైన బ్లీచింగ్ లక్షణాలు ఉండుట వలన అవాంఛిత రోమాలను తగ్గించటంలో చాల సమర్ధవంతంగా పనిచేస్తుంది.కందిపప్పును రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం మెత్తని పేస్ట్ గా తయారుచేయాలి.ఈ పేస్ట్ లో బంగాళాదుంప జ్యుస్ ,నిమ్మరసం,తేనే కలిపి ముఖానికి రాసి పావుగంట అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.