నడుం నొప్పి(Backpain) ఇప్పుడు వయస్సుతో సబంధం లేకుండా వస్తోంది. ఆ నొప్పిని తగ్గించుకోవడం కోసం చేయని ప్రయత్నాలు లేవు.. కాని తగ్గడం లేదని తెగ బాధపడుతుంటారు.. ఎన్నో మందులు వాడుతుంటారు. అయితే నిజంగా నడుం నొప్పి తగ్గించుకోవాలి అంటే.. ఓప్పిగ్గా కొన్ని ప్రయత్నాలు చేయడండి.. ఆ నొప్పి పారిపోతుంది.

వ్యాయామం(Exercise) చేయడం వంటి చిన్న చిన్న పనులతో నడుం నొప్పి నుంచి పూర్తిగా ఉపశమనం పొందొచ్చు. నడుం నొప్పి నుండి ఉపశమనం పొందడానికి చేయవలసిన అనేక పరిష్కారాలు తెలుసుకుందాం..నడుము నొప్పిగా ఉన్నవారు తగ్గించుకోవాలంటే ముందు మీరు ఒత్తిడిని తగ్గించుకోవాలి.

రోజువారీ అలవాట్లను మార్చుకోవడం వల్ల నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందే వీలుంటుంది. చిన్న చిన్న టిప్స్ తో నడుం నొప్పిని తగ్గించుకోవచ్చు. నడుంనొప్పి ఎక్కువగా ఉన్నవారు పడుకునే సమయంలో వెనుక భాగం పై ఒత్తిడి పడుతుంది. మోకాళ్ళ(Knees) కింద దిండు(Pillow) పెట్టుకొని పడుకోవడం ద్వారా.. ఒత్తిడి తగ్గి.. నడుము నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది.

నడుం నొప్పి తగ్గడం కోసం వారానికి కనీసం రెండు సార్లు నడుమును బలపరిచే వ్యాయామాలను చేయండి. ఇక చాలా మంది కంప్యూటర్స్ పైనే వర్క్ చేస్తున్నారు. ఈ సమయంలో కూర్చునే పొజిషన్ సరిగా ఉండేలా చూసుకోవాలి. లేదా సమస్య ఎక్కువవుతుంది. మానిటర్ కళ్లకు సమానంగా ఉండేలా చూసుకోవాలి.

గుండె, డయాబెటీస్ ఉన్నవారు అధికబరువును కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఈ కారణంగా నడుము నొప్పి ఎక్కువయ్యే ప్రమాదముంది. కాబట్టి వీలైంతగా కేర్ తీసుకోవాలి. ఇక ఆహారం విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.ఇక ఆహారం విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కెఫీన్, ప్రాసెస్ చేసిన ఆహారపదార్థాలు తగ్గించాలి. వీటికి బదులు పొట్టు ధాన్యాలు, సోయా, నట్స్, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటుండాలి.

Updated On 26 Sep 2023 6:01 AM GMT
Ehatv

Ehatv

Next Story