ప్రస్తుత సమాజాంలో .. ఒత్తిడి జీవితం వల్ల ఎన్నో సమస్యలు.. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. మన ప్రశాంతతను మనం చేసే పని తినేస్తుంటంది.. అది కాస్త రాత్రి నిద్రపై ప్రభావం పడుతుంది. ఆ ప్రభావం రకరకాలుగా ఉంటుంది అందులో.. నిద్రపోయేటప్పుడు ఇబ్బంది పెట్టే సమస్య గురక ఒకటి. ఈ సమస్య తీవ్ర అనారోగ్య సమస్యకి లక్షణంగా ఉండొచ్చు. కొన్నిసార్లు గురక(snoring) తరచుగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఈ గురకను ప్రధమికంగా తగ్గించుకోవడం కోసం.. ఈ సమస్యనుంచి దూరం అవ్వడం కోసం కొన్ని చిట్కాలు(Tips) పాటిస్తే చాలు అవి మీకు చాలా వరకూ ఉపయోగపడతాయి. ముఖ్యంగా నిద్ర పోయేప్పుడు శ్వాస తీసుకునేటప్పుడు గొంతులో గాలి ప్రవహిస్తే అది గురక శబ్ధంగా మారుతుంది.. ఇది గొంతులో వదులుగా ఉండే కణజాలాలని కంపించేలా చేస్తుంది. దీంతో శబ్ధం వస్తుంది. గురక మీ చుట్టూ ఉన్నవారి నిద్రని చెడగొడుతుంది. ఇంకొంత మందికి ఇది ఎక్కువ సౌండ్ తో రావడం వల్ల.. చుట్టు ఎవరూ ఉండే పరిస్థితి ఉండదు.
గురక అనేది చాలా చిరాగ్గా ఉంటుంది. దీనిని నిర్లక్ష్యం చేయడం చాలా సమస్యలకు దారి తీస్తుంది. అందుకే గురకను నిర్లక్ష్యం చేయవద్దు. గురకపెట్టేవారు ఒకేవైపుకి పడుకోవడం వల్ల గురక సమస్యని తగ్గించుకోవచ్చు. దీంతో గాలి సులభంగా లోపలకి వెళ్తుంది. తల భాగం పైకి ఉండేలా ఉండండి. కొన్ని అంగుళాల ఎత్తులో పడుకుంటే మీ వాయు మార్గాలు తెరచుకుని గురక తగ్గుతుంది
ప్రతిరోజూ 7 నుండి 9 గంటల నిద్ర అవసరం. నిద్ర లేకపోవడం గురక ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది గొంతు కండరాలను రిలాక్స్ చేస్తుంది. దీని వల్ల వాయుమార్గాల్లో అడ్డంకి ఏర్పడుతుంది. ఇది నిద్రలేమి ప్రమాదాన్ని పెంచి, నిద్రకి భంగం కలిగిస్తుంది.
పడుకునే ముందు ఆల్కహాల్ తీసుకోవద్దని గుర్తుపెట్టుకోండి. దీని వల్ల గొంతు కండరాలు రిలాక్స్ అవుతాయి. గురకకి కారణమౌతుంది. దీని వల్ల నిద్ర సమస్యలు వస్తాయి.ధూమపానం వల్ల స్లీప్ ఆప్నియా సమస్య పెరుగుతుంది. దాని వల్ల కూడా భయంకరమైన గురక వస్తుంది.
ఇవే కాదు ఊబకాయం ,సైనస్.. ఎక్కువగా జలుబు చేయడం.. బాగా అలసిపోవడం.. అతిగా తిని వెంటనే పడుకోవడం..ఇలా ఒక్కటి కాదు... గురక సమస్యకు చాలా కారణాలు ఉన్నాయి ఉంటాయి. అందుకే ఈ విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తే చాలు.. గురకసమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు.