Beast Hair Growth Oils : జుట్టు పెరుగుదలకు ఈ 4 హెయిర్ ఆయిల్స్ మంచివి..
ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలిపోవడం.. అలాగే చిట్లీ పోవడం.. నిర్జీవంగా మారడం. ఈ సమస్యలను తగ్గించుకునేందుకు మార్కెట్లో లభించే వివిధ రకాల జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. జుట్టు సమస్యలను తగ్గించుకునేందుకు సప్లిమెంట్స్ తీసుకోవడం..చికిత్స తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇలాంటి ప్రయత్నాలు ఏమీ లేకుండా.. కొన్ని హెయిర్ ఆయిల్స్ జుట్టుకు బాగా ఉపయోగపడుతాయి.
ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలిపోవడం.. అలాగే చిట్లీ పోవడం.. నిర్జీవంగా మారడం. ఈ సమస్యలను తగ్గించుకునేందుకు మార్కెట్లో లభించే వివిధ రకాల జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. జుట్టు సమస్యలను తగ్గించుకునేందుకు సప్లిమెంట్స్ తీసుకోవడం..చికిత్స తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇలాంటి ప్రయత్నాలు ఏమీ లేకుండా.. కొన్ని హెయిర్ ఆయిల్స్ జుట్టుకు బాగా ఉపయోగపడుతాయి. అవి జుట్టు పెరుగుదలను పెంచడంతో పాటు వాటిని సిల్కీగా, మెరిసేలా, పొడవుగా, మందంగా మార్చడంలో సహాయపడుతాయి. జుట్టు సంరక్షణ కోసం ప్రతిసారి నూనె రాయడం అవసరం. అటువంటి పరిస్థితిలో ఒకటి కాదు అనేక విధాలుగా ఉపయోగకరంగా ఉండే హెయిర్ ఆయిల్స్ ఎంచుకోవడం అవసరం. అలాగే జుట్టు సంబంధిత సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతాయి. కాబట్టి జుట్టుకు ఉత్తమమైన నూనెలు ఏంటో తెలుసుకుందాం.
భృంగరాజ్ నూనె
భృంగరాజ్ నూనెలో ఔషధ మూలకాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఇది జుట్టు పెరుగుదలకు, బలంగా పెంచడంలో సహాయపడుతుంది. గోరువెచ్చని భృంగరాజ్ నూనెను తలకు మసాజ్ చేసి... కొంత సమయం తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. జుట్టు పొడిబారడం, చుండ్రు వంటి సమస్యలను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది.
ఆల్మండ్ ఆయిల్..
బాదం నూనెలో ఒమేగా 3, విటమిన్ ఇ, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. జుట్టు బలంగా, మందంగా, పొడవుగా మార్చడంలో ఇది సహయపడుతుంది. వారానికి కనీసం రెండు సార్లు బాదం నూనెతో తలకు మసాజ్ చేసి.. అలాగే జుట్టు మూలం నుండి కొన వరకు నూనె రాయాలి. ఇది డ్రై స్కాల్ప్, చుండ్రు వంటి సమస్యలను కూడా తొలగిస్తుంది.
నువ్వుల నూనె..
నువ్వుల నూనె జుట్టుకు చాలా మంచిదని భావిస్తారు. ఇందులో ఒమేగా 3, ఒమేగా 6 మరియు ఒమేగా 9 పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల జుట్టు పొడిబారదు. అలాగే జుట్టు బలంగా, సిల్కీ, మందంగా మారుతుంది. అంతే కాదు, ఇది జుట్టు పెరుగుదలను పెంచడంలో కూడా సహాయపడుతుంది.
ఆలివ్ ఆయిల్
జుట్టు సంరక్షణలో ఆలివ్ ఆయిల్ మంచి పాత్ర పోషిస్తుంది. ఇది డ్యామేజ్ అయిన జుట్టు సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీంతోపాటు, ఇది జుట్టు పొడిబారడం, చిట్లితను తొలగించడానికి కూడా పనిచేస్తుంది. అంతేకాదు జుట్టును ఒత్తుగా, దృఢంగా మార్చడంలో కూడా సహయపడుతుంది. ఆలివ్ ఆయిల్‌లో గుడ్డులోని తెల్లసొన, తేనె మిక్స్ చేసి జుట్టుకు పట్టించి ఇరవై నిమిషాల తర్వాత షాంపూతో శుభ్రం చేయాలి.. దీని వల్ల జుట్టు చీలిపోయే సమస్య నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.