ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా రోగాలు(Diseases) వచ్చి మీద పడుతున్నాయి. పసి పిల్లల దగ్గరి నుంచి పండు ముసలి వరకు ఈ రోగం, ఆ రోగం అని తేడా లేకుండా వస్తున్నాయి. యదాద్రి(Yadadri) జిల్లాలో ఆరు నెలల ఓ చిన్నారికి కూడా ఇలాంటి వ్యాధే ఒకటి వచ్చింది. జబ్బు నయం కావడానికి అమెరికాలో దొరికే ఇంజెక్షన్(Injection) కావాలి. కానీ దాని ఖరీదు వేలు, లక్షలు కూడా కాదు ఏకంగా పదహారు కోట్లు కావాలి. విదేశీ దాతలు దాదాపు రూ.10 కోట్లు సమకూర్చగా మరో ఆరు కోట్ల కోసం తల్లిదండ్రులు దీనంగా చూస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే యాదాద్రి జిల్లా వలిగొండ(Valigonda) మండలం పులిగిల్ల(Puligilla) గ్రామానికి చెందిన కొలను దిలీప్‌రెడ్డి, యామిని దంపతులకు ఆరు నెలల బాబు ఉన్నాడు. చిన్నారి భవిక్‌రెడ్డి ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. భవిక్‌రెడ్డికి స్పైనల్‌ మస్కలర్‌ అట్రోఫీ(Spinal muscular atrophy) అనే వ్యాధితో బాధపడుతుననాడు. లక్షల మందిలో ఎవరికో ఒకరికి వచ్చే ఈ జబ్బును చిన్నారి భవిక్‌రెడ్డికి వచ్చింది. నరాల కండరాల బలహీనత ఎస్‌ఎమ్‌ఏ టైప్‌ –1 హైరిస్క్‌గా డాక్టర్లు గుర్తించారు. ఈ వ్యాధిని బాగు చేసే ఇంజెక్షన్‌ ఇవ్వకపోతే చనిపోతాడని డాక్టర్లు చెప్పినట్లు తల్లిదండ్రులు చెప్తున్నారు.

అమెరికాలోనే లభించే ఈ ఇంజెక్షన్‌ ఖరీదు రూ.16 కోట్లుగా ఉంటుందని వైద్యులు తెలిపారు. రెయిన్‌బో ఆస్పత్రి న్యూరాలజిస్ట్ రమేష్‌ పర్యవేక్షణలో బాబుకు చికిత్స అందిస్తున్నారు. రెయిన్‌బో ఆస్పత్రి సహకారంతో విదేశాల నుంచి రూ.10 కోట్ల విరాళాలు సేకరించారు. మరో ఆరు కోట్లు జమచేసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో చిన్నారి ఇంజెక్షన్‌ కోసం తల్లిదండ్రులు దాతల విరాళాలు కోరుతున్నారు. బ్యాంక్‌ ఖాతా లేదా ఫోన్‌పే, గూగుల్‌ పే ద్వారా విరాళాలు అందించాలని కోరుతున్నారు. బ్యాంక్‌ ఖాతా పేరు: కొలను దిలీప్‌రెడ్డి, అకౌంట్‌ నంబర్‌ : 42380569990, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ : ఎస్‌బీఐఎన్‌0021766, బ్యాంకు బ్రాంచ్‌: ఎస్‌బీఐ వలిగొండ. ఫోన్‌పే లేదా గూగుల్‌ పే ద్వారా పంపాలనుకుంటే 9640160506 నెంబర్‌కు బదిలీ చేయాలని భవిక్‌రెడ్డి తల్లిదండ్రులు చేతులు జోడించి వేడుకుంటున్నారు.

Updated On 16 May 2024 2:05 AM GMT
Ehatv

Ehatv

Next Story