చరిత్రలో, చక్రవర్తుల కథనాలు, విలాసవంతమైన జీవనశైలి తరుచుగా ఎక్కడో ఒక చోట చదువుతుంటాం.

చరిత్రలో, చక్రవర్తుల కథనాలు, విలాసవంతమైన జీవనశైలి తరుచుగా ఎక్కడో ఒక చోట చదువుతుంటాం. పాటియాలా మహారాజా సర్ భూపీందర్ సింగ్(Maharaja Sir Bhupinder Singh) విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాడు. 1891లో జాట్ సిక్కు ఫుల్కియన్ రాజవంశం(Jat Sikh Phulkian dynasty)లో జన్మించిన అతను కేవలం తొమ్మిదేళ్లకే సింహాసనాన్ని అధిష్టించాడు. భూపీందర్‌సింగ్‌ 10 మందిని వివాహం చేసుకున్నాడు. 350 మంది ఉంపుడుగత్తెలను అంతఃపురంలో ఉంచారు.

మహారాజా వ్యక్తిగత జీవితం అత్యంత విలాసవంతమైనది. అతను పది మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు, 350 మంది ఉంపుడుగత్తెలు ఉండేవారు. విలాసవంతమైన రాజ్యాన్ని సృష్టించాడు. ఈ విస్తారమైన కుటుంబంలో, అతనికి 88 మంది సంతానం. తన భార్యలను అలంకరించేందుకు బ్రిటన్(Briton), ఫ్రాన్స్‌(France)కు చెందిన నగల వ్యాపారులు, హెయిర్ స్టైలిస్ట్‌లు, పెర్ఫ్యూమర్‌లు, ప్లాస్టిక్ సర్జన్‌లతో సహా నిపుణుల బృందాన్ని నియమించుకున్నాడు. రాజమాత విమలా కౌర్ అతనికి ఇష్టమైనది, మరియు ఇద్దరూ తరచూ విదేశాలకు వెళ్లి బహిరంగ ప్రదర్శనలు ఇచ్చారు. మహారాజా తన స్విమ్మింగ్ పూల్ చుట్టూ తన అంతఃపురానికి చెందిన ఇష్టమైనవారిని నగ్నంగా చూసేవాడట. ఈత కొట్టే సమయంలో తన ఉంపుడుగత్తెలతో లాలన పొందడమే కాకుండా విస్కీ కూడా సేవించేవాడట.

అంతేకాదు పడకగది సీలింగ్‌పై శృంగార చిత్రాలు ఏర్పాటు చేసుకున్నాడు. 44 రోల్స్‌ రాయిస్ కార్లను సేకరించేవాడు. అతనికి బంగారు, వజ్రాభరణాలపై కూడా మక్కువ ఎక్కువే. 1001 నీలం, తెలుపు వజ్రాలతో కూడిన ఆభరణాన్ని సంవత్సరానికి ఒకసారి ధరించేవాడు. అంతేకాకుండా భూపీందర్‌సింగ్‌ మంచి భోజన ప్రియుడు. రోజుకు 40 నుంచి 50 ఎముకలు లేని పిట్టలను తినేవాడని, 20 పౌండ్ల ఆహారం తీసుకునేవాడని, టీ-టైం స్నాక్‌ సందర్భంగా రెండు కోళ్లు కూడా తినేవాడని కథనాలు వచ్చాయి.

ehatv

ehatv

Next Story