పాలస్తీనాపై(Palestine) ఇజ్రాయెల్‌ సైన్యం(Israel Army) జరుపుతున్న దాడులలో ఇప్పటికే వేలాది మంది చనిపోయారు. ఇప్పటికే పది వేల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు విడిచారు. ఇజ్రాయెల్‌లో 14 వందలమంది చనిపోయారు. ఈ క్రమంలో ఓ విషయం వెలుగులోకి వచ్చింది. యుద్ధంలో ప్రాణాలు విడిచిన సైనికులు, సామాన్య యువకుల వీర్యాన్ని(Semen) సేకరించడానికి బాధిత కుటుంబసభ్యులు ప్రయత్నిస్తున్నారు.

పాలస్తీనాపై(Palestine) ఇజ్రాయెల్‌ సైన్యం(Israel Army) జరుపుతున్న దాడులలో ఇప్పటికే వేలాది మంది చనిపోయారు. ఇప్పటికే పది వేల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు విడిచారు. ఇజ్రాయెల్‌లో 14 వందలమంది చనిపోయారు. ఈ క్రమంలో ఓ విషయం వెలుగులోకి వచ్చింది. యుద్ధంలో ప్రాణాలు విడిచిన సైనికులు, సామాన్య యువకుల వీర్యాన్ని(Semen) సేకరించడానికి బాధిత కుటుంబసభ్యులు ప్రయత్నిస్తున్నారు. దగ్గరివాళ్లు చనిపోయిన విషయం తెలిసిన వెంటనే వారు వైద్యులను సంప్రదిస్తున్నారు. ఇప్పటి వరకు 33 మంది నుంచి వీర్యం సేకరించినట్టు స్పెర్మ్‌ బ్యాంకులు(Sperm Banks) తెలిపాయి. ఇందుకోసం ప్రస్తుతమున్న కొన్ని నిబంధనలను కూడా ఇజ్రాయెల్‌ ప్రభుత్వం తాజాగా సడలించడం గమనార్హం. ఈ విధానాన్ని మరణాంతర వీర్య సేకరణ అంటారు. ఫ్యూచర్‌లో గర్భధారణకు వీలుగా మరణించిన వ్యక్తి నుంచి వీర్యకణాలను సేకరిస్తారు. వ్యక్తి మరణించిన ఒకటి, ఒకటిన్నర గంటల్లోనే ఈ ప్రక్రియ పూర్తి కావాలి. తర్వాత వాటిని అతి శీతల ఉష్ణోగ్రత(Cool Temperature) దగ్గర భద్రపరుస్తారు. అవసరమైనప్పుడు ఇంట్రాసైటోప్లాస్మిక్‌ స్పెర్మ్‌ ఇంజెక్షన్‌ విధానంలో గర్బధారణకు ప్రయత్నిస్తారు. ఇజ్రాయెల్‌ నిబంధన ప్రకారం పెళ్లి కాని యువకుడి నుంచి వీర్యాన్ని సేకరించాలనుకుంటే ఫ్యామిలీ కోర్టు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అదే పెళ్లయిన వ్యక్తి అనుకోండి..భార్య పర్మిషన్ ఉంటే చాలు. మరణించిన వారి నుంచి వీర్యాన్ని సేకరించడమే కష్టం. ఇప్పడు ఫ్యామిలీ కోర్టు(Family Court) అనుమతి లేకున్నా పెళ్లి కాని యువకుల నుంచి వీర్యాన్ని సేకరించవచ్చు. ఇజ్రాయెల్‌ కల్పించిన వెసులుబాటు ఇది. నాలుగు స్పెర్మ్‌ బ్యాంకులు 24 గంటలూ పనిచేసేలా ఐడీఎఫ్‌ నుంచి ప్రత్యేక యూనిట్లను ఏర్పాటు చేసింది ఇజ్రాయెల్‌. ఇదిలా ఉంటే కేవలం కుటుంబీకుల నుంచే కాకుండా పిల్లల కోసం ప్రయత్నిస్తున్న ఎంతో మంది మహిళలు వీర్యదాతల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. రంగు, శరీరాకృతి, దేహ దారుఢ్యం కలిగిన వ్యక్తుల కంటే దేశం కోసం పోరాడే సైనికుల వీర్యానికే స్థానికంగా భారీ డిమాండు పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

Updated On 11 Dec 2023 5:43 AM GMT
Ehatv

Ehatv

Next Story