మండే వేడిని ఎదుర్కోవడమే కాకుండా, టాన్(Tan) సమస్యను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమస్యను తగ్గించేందుకు వివిధ రకాల ఫేస్ మాస్క్‌లు(Face Mask), సన్‌స్క్రీన్‌లను(sunscreen) ఉపయోగిస్తారు. అయితే అన్ని వాడినప్పటికీ చర్మం టాన్ అవుతుంది. కాబట్టి ఇంట్లోనే స్కిన్ ట్యానింగ్‌ను తొలగించే మార్గాలను తెలుసుకుందామా.

భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటలే మిట్ట మధ్యాహ్నాన్ని తలపిస్తోంది. ఈ ఎండలో ఎవరు బయటకు రావద్దని వేసవిలో ఎండలో ఎవరూ బయటకు రావద్దని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. కానీ చాలా మంది ఇంటి నుంచి బయటకు రావాల్సిందే. అటువంటి పరిస్థితిలో మండే వేడిని ఎదుర్కోవడమే కాకుండా, టాన్(Tan) సమస్యను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమస్యను తగ్గించేందుకు వివిధ రకాల ఫేస్ మాస్క్‌లు(Face Mask), సన్‌స్క్రీన్‌లను(sunscreen) ఉపయోగిస్తారు. అయితే అన్ని వాడినప్పటికీ చర్మం టాన్ అవుతుంది. కాబట్టి ఇంట్లోనే స్కిన్ ట్యానింగ్‌ను తొలగించే మార్గాలను తెలుసుకుందామా.

హోం రెమెడీ..
ఈ హోం రెమెడీని రెడీ చేయడానికి రెండు చెంచాల పసుపు(Turmeric) పొడిని తీసుకోవాలి. తర్వాత పెనం మీద పసుపు వేసి బాగా వేయించాలి. అది పూర్తిగా గోధుమ రంగులోకి మారే వరకు వేయించాలి అని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుని చల్లారనివ్వాలి. తర్వాత దానికి కొద్దిగా పచ్చి పాలు(Raw Milk), సుమారు ఒక చెంచా తేనె(Honey) వేసి కలిపి చిక్కటి పేస్ట్‌లా సిద్ధం చేసుకోవాలి. అప్పుడు ఈ పేస్ట్‌ను అవసరానికి అనుగుణంగా టానింగ్ చూసే శరీర భాగాలపై రాయండి. దానికి పది నిమిషాలు వదిలి.. ఆ తర్వాత నీటితో కడగాలి. దీంతో చర్మం పై టానింగ్ కొన్ని నిమిషాల్లో సులభంగా తొలగించబడుతుంది.

మరిన్ని పద్దతులు..
1. చర్మంపై టాన్ తొలగించడానికి పెరుగు(curd) సహాయపడుతుంది. ఇందుకోసం రెండు చెంచాల పెరుగు తీసుకుని అందులో ఒక చెంచా బియ్యప్పిండిని కలిపి పేస్ట్‌లా తయారుచేయాలి. తర్వాత దాన్ని టానింగ్ ప్రదేశంలో అప్లై చేసి కాసేపు స్క్రబ్ చేయాలి. పది నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోవాలి.

2. టానింగ్‌ను తొలగించడానికి నిమ్మకాయను(Lemon) ఉపయోగించవచ్చు. ఇందుకోసం ఒక నిమ్మకాయ రసాన్ని తీసి, అందులో ఒక చెంచా తేనె కలిపి పేస్ట్‌ను సిద్ధం చేయండి. తర్వాత ఈ పేస్ట్‌ను చర్మంపై అప్లై చేసి పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచాలి. సాధారణ నీటితో శుభ్రం చేయాలి.

3. టానింగ్‌ను తొలగించడానికి బొప్పాయిని(Papaya) ఉపయోగించాలి. ఇందుకోసం పండిన బొప్పాయి ముక్కను తీసుకుని, దానిని పేస్ట్ చేయాలి. ఆ తర్వాత ఈ పేస్ట్‌ని టానింగ్ ప్రదేశంలో అప్లై చేసి ఐదు నిమిషాల పాటు రుద్దాలి. ఆ తర్వాత పదినిమిషాలు అలాగే ఉంచి తర్వాత నీళ్లతో కడిగేయాలి.

Updated On 7 Jun 2023 11:40 PM GMT
Ehatv

Ehatv

Next Story