మన శరీరంలో కిడ్నీలు(Kidney) చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అవి పాడైపోతే.. మన శరీరం మనం బ్రతికుండగానే కళ్ళిపోతుంది. అందుకే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంచుకోండి. అడ్డమైనవి తింటే.. అది కిడ్నీపై ప్రభావం చూపిస్తుంది. బాగా తాగినా సరే లివర్ తో పాటు కిడ్నీలు కూడా పోతాయి. అందుకే కిడ్నీలు జాగ్రత్త. మరి కిడ్నీ సమస్య వచ్చింది అంటే దాన్ని కనిపెట్టడం ఎలా..?

మన శరీరంలో కిడ్నీలు(Kidney) చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అవి పాడైపోతే.. మన శరీరం మనం బ్రతికుండగానే కళ్ళిపోతుంది. అందుకే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంచుకోండి. అడ్డమైనవి తింటే.. అది కిడ్నీపై ప్రభావం చూపిస్తుంది. బాగా తాగినా సరే లివర్ తో పాటు కిడ్నీలు కూడా పోతాయి. అందుకే కిడ్నీలు జాగ్రత్త. మరి కిడ్నీ సమస్య వచ్చింది అంటే దాన్ని కనిపెట్టడం ఎలా..?

కిడ్నీ సమస్యలు(Kidney problems) రకరకాలుగా ఉంటాయి. వాటిని ముందుగా కనిపెట్టి ట్రీట్మెంట్ తీసుకోకపోతే.. ఆతరువాత వ్యాధిముదిరితే ఏం చేయలేము. అందుకే కిడ్నీ వ్యాధులను ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం. కిడ్నీ ఆరోగ్యంగా ఉంటే.. నోటి దుర్వాసన ఉండదు, మూత్రం లో సమస్య ఉండదు, కంటి చూపు. చర్మం కాంతి కోల్పోవడం లాంటివి కిడ్నీ సమస్యలకు కారణాలు.

కిడ్నీల పనితీరు సరిగా లేకపోవడం వల్ల శరీరంలో మలినాలు(impurities) పేరుకుపోతాయి. దీని ప్రభావం చర్మంపై కూడా స్పష్టంగా తెలుస్తుంది. చర్మం కాంతి కోల్పోతుంది. దురదలు, పుండ్లు(teeth) పడతాయి.. చర్మం(Skin) కుచించుకుపోతుంది. ఈ పరిస్థితిలో ఇన్‌ఫెక్షన్‌ ప్రమాదం పెరుగుతుంది. అలాగే శరీరం ముఖంపై దద్దుర్లు కూడా కనిపిస్తాయి. అందుకే వెంటనే జాగ్రత్త పడండి.

మనకు సాధారణంగా నోటి దుర్వాసన ఎలా వస్తుంది.. నోరు శుభ్రంగా ఉంచుకోకపోతే.. వస్తుంది. లేదా ఉల్లిపాయి, వెల్లుల్లి లాంటివి తింటే నోరు వాసన వస్తుంది కాని ఇలాంటివి ఏమి చేయకుండా నోటి దుర్వాసన(bad smell in mouth) వస్తే అప్రమత్తంగా ఉండాలి. ఇవి కిడ్నీ వ్యాధి ప్రారంభ లక్షణాలు కావచ్చు. సో బీ కేర్ ఫుల్.

శరీరంలో ఉండే ద్రవాలను ఫిల్టర్ చేయడమే కిడ్నీ పని. దీని పనితీరులో ఏదైనా సమస్య ఏర్పడితే మూత్రం రంగులో తేడా కనిపిస్తుంది. మూత్రం రంగు ముదురు పసుపు, మూత్రంలో నురుగు, తరచుగా మూత్రవిసర్జన జరుగుతాయి. ఈ పరిస్థితిలో వెంటనే మూత్రపిండాల పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.

కిడ్నీ సమస్య వల్ల శరీరంలో ఐరన్‌తో పాటు అనేక రకాల పోషకాల లోపం ఏర్పడుతుంది. దీంతో పాటు ఎర్ర రక్త కణాలు కూడా తగ్గుతాయి. ఇవి రక్తంలో ఆక్సిజన్ స్థాయిని మెయింటెన్‌ చేసే కణాలు. RBCలు లేకపోవడం వల్ల అలసటను ఎదుర్కోవలసి వస్తుంది.

ఇవే కాదు.. అతి మూత్ర.. అసలు మూత్రం రాకపోవడం.. మంట, దురద, నొప్పి.. ఇలా చాలా రకాలు కారణాలు కిడ్నీ సమస్యలకు దారి తీస్తాయి. అందుకే మీ లో భాగాలను శుభ్రంగా ఉంచుకోండి.. ఇన్ఫెక్షన్లు రాకుండా జాగ్రత్త పడండి. ముఖ్యంగా స్త్రీలు యోని భాగాన్ని నీట్ గా ఉంచాలి.

Updated On 17 Aug 2023 7:26 AM GMT
Ehatv

Ehatv

Next Story