కొత్త సంవత్సరానికి హైదరాబాద్‌(Hyderabad) యువత గ్రాండ్‌గా వెల్‌కం చెప్పింది. చుక్కా, ముక్కతో బాగానే ఎంజాయ్‌ చేశారు. అయితే విందుతో పాటు పొందును కూడా బాగానే ఎంజాయ్‌(Enjoy) చేశారట. హైదరాబాద్‌లో నిమిషానికి 1,244 బిర్యానీల ఆర్డర్లు వచ్చాయని, అదే సమయంలో గంటకు 1,722 కండోమ్‌ల(Condoms) ఆర్డర్లు వచ్చినట్టు స్విగ్గీ అధికారికంగా ప్రకటించింది.

నూతన సంవత్సరం(New Year) వేడుకల సందర్భంగా మరోసారి బిర్యానీనే(Biryani) పై చేయి సంపాదించింది. స్విగ్గీలో బిర్యానీని కూడా బాగానే లాగించేశారు. డిసెంబర్‌ 31 ఒక్కరోజే హైదరాబాద్‌లో నిమిషానికి 1,244 బిర్యానీల ఆర్డర్‌ వచ్చినట్టు ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ(Swiggy) తెలిపింది. ఏకంగా 4.8 లక్షల బిర్యానీలు ఆర్డర్‌ చేసి.. గత రికార్డులను హైదరాబాదీలు తిరగరాశారు. గత ఏడాది కంటే అధికంగా 1.6 రేట్లు ఆర్డర్లను ఆందుకున్నట్టు స్విగ్లీ తెలిపింది. దేశవ్యాప్తంగా నాలుగు బిర్యానీలు ఆర్డర్ పెడితే.. అందులో ఒకటి హైదరాబాద్‌ నుంచే ఆర్డర్‌ వచ్చింది.

2022 డిసెంబర్‌ 31తో పోలిస్తే ఫుడ్ డెలివరీ(Food delivery), ఇన్‌స్టామార్ట్ ఆర్డర్లు పెరిగినట్లు స్విగ్గీ ప్రకటించింది. 2022లో దేశవ్యాప్తంగా 3.50 లక్షల బిర్యానీ ఆర్డర్‌లను, 2.5 లక్షల పిజ్జాలను(Pizza) డెలివరీ చేసినట్టు స్విగ్గీ పేర్కొంది. అయితే 2023 డిసెంబర్ 31న రాత్రి 9 నుంచి 10 మధ్యలో.. దాదాపు మిలియన్ మంది కస్టమర్లు స్విగ్గీ యాప్‌లో యాక్టివ్‌గా ఉన్నట్టు ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. మరో షాకింగ్‌ న్యూస్‌ ఏంటంటే.. న్యూఇయర్ సందర్భంగా గంటకు 1722 కండోమ్‌ల ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ ట్వీట్ చేసింది. డిసెంబర్ 31న పగటి పూట ఈ ఆర్డర్లు రావడం గమనార్హం.

Updated On 2 Jan 2024 1:56 AM GMT
Ehatv

Ehatv

Next Story